ఆలయాల్లో ధ్వజ స్తంభం లేకపోతే ఏమవుతుంది?

ఆలయం నిర్మించేటప్పుడు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టిస్తారు.దీనిని ఒక పెద్ద వేడుకలా నిర్వహిస్తారు.

అసలు ఎందుకు ధ్వజ స్తంభానికి అంత ప్రాధాన్యత ఇస్తారు? ఆలయాల ఎదుట ధ్వజస్తంభం లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగమ సంప్రదాయం ప్రకారం దేవుడు ఐదు రూపాల్లో.

ఐదు చోట్ల ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.అందులో భాగంగానే దైవశక్తి మూలవిరాట్టులో, ఉత్సవ మూర్తిలో, పాదుకల్లో, అర్చకునిలో.అలాగే ధ్వజ స్తంభంలో ఉంటుందట.

కనుక ఆలయాన్ని నిర్మించేటప్పుడు తప్పనిసరిగా ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేస్తారు.అలాగే దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయం ఎక్కడ ఉందో తెలిసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

అంతే కాదండోయ్ భక్తులు ఆలయానికి చేరే సరికి ఆలయం ద్వారాలు మూసి వేసినా  లేదా ఆలయం మూసి ఉన్న రోజు వచ్చినా భక్తులు బాధపడకుండా ఉండేందుకు ధ్వజస్తంభాన్ని బయట ఏర్పాటు చేస్తారు.ధ్వజస్తంభంలో కూడా దేవుడు కొలువై ఉంటాడు కాబట్టి గుడి మూసి ఉన్నా ధ్వజ స్తంభాన్ని మొక్కుకోవచ్చు.

దీన్ని దర్శించుకున్నా.దేవుడిని దర్శించుకున్న ఫలితం వస్తుందని పెద్దలు చెబుతుంటారు.

ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొనే.మన పెద్దలు మూల విరాట్టు దృష్టి కోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.గుడికి వచ్చిన ప్రతీ ఒక్కరు ముందుగా ధ్వజ స్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టును చూడ కూడదు.

ధ్వజ స్తంభం లేని గుడులకు స్వాములు, సన్యాసులు  దేవాలయ గుర్తింపునే ఇవ్వరంట. ధ్వజ స్తంభానికి జీవ ధ్వజం అని మరో పేరు ఉంది.అందుకే గుడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ధ్వజస్తంభాన్ని మొక్కుకొని.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.

ప్రదక్షిణలు చేశాకే గుడిలోకి వెళ్తుంటారు.

Advertisement

తాజా వార్తలు