బాదంను నాన‌బెట్ట‌కుండానే తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

బాదం ప‌ప్పు.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

న‌ట్స్ జాతికి చెందిన బాదం ప‌ప్పులో ప్రోటీన్‌, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ఫైబ‌ర్‌, గుడ్ ఫ్యాట్స్‌, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగానే కాకుండా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలోనూ, కేశ సంర‌క్ష‌ణ‌లోనూ బాదం అమోఘంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే బాదం ప‌ప్పు విష‌యంలో చాలా మంది చేసే కామ‌న్ పొర‌పాటు ఏంటంటే.నాన‌బెట్ట‌కుండా తినేయ‌డం.

అవును, తెలిసో తెలియ‌కో కొంద‌రు బాదంను వాట‌ర్‌లో నాన‌బెట్ట‌కుండా డైరెక్ట్‌గా తినేస్తుంటారు.కానీ, ఇలా ఎప్పుడూ చేయ‌కూడ‌దు.

Advertisement

ఎందుకంటే, బాదం ప‌ప్పు యొక్క పొట్టులో ఫైటిక్‌ ఆసిడ్ మ‌రియు యాంటీ న్యూట్రియంట్లు ఉంటాయి.ఇవి గాల్ బ్లాడ‌ర్‌లో రాళ్లు ఏర్ప‌డేలా చేస్తాయి.

అలాగే బాదం ప‌ప్పును నేరుగా తిన‌డం వ‌ల్ల‌.అవి త్వ‌ర‌గా జీర్ణం కావు.

దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఒత్తిడి ప‌డి బ‌ల‌హీనంగా మారిపోతుంది.ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ వేధిస్తుంటాయి.

ఇక బాదం గింజ పొట్టులో టానిన్లు ఉంటాయి.ఇవి మ‌న బాడీని పోషకాలను గ్రహించుకోకుండా నిరోధిస్తాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

అందు వ‌ల్ల‌నే బాదంను నాన‌బెట్టుకుని తినాలి.ముఖ్యంగా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు ఐదారు బాదం గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి.

Advertisement

ఉద‌యాన్నే పొట్టు తొల‌గించి తింటే వెయిట్ లాస్ అవుతారు.మెద‌డు ప‌ని తీరు మెరుగ్గా త‌యారు అవుతుంది.

ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి పోయి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.

అంతే కాదు, నాన బెట్టిన బాదం ప‌ప్పుల‌ను రోజు ఉద‌యాన్నే తింటే మ‌ధుమేహం, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.శ‌రీరంలో ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.మ‌రియు ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.

తాజా వార్తలు