చలికాలంలో కీరదోసకాయ తినొచ్చా.. తినకూడదా.. కచ్చితంగా తెలుసుకోండి!

కీరదోసకాయ( Cucumber ).ఎక్కువ నీటి శాతం కలిగి ఉన్న ఈ కూరగాయను చాలా మంది సమ్మర్ లో మాత్రమే ప్రిఫర్ చేస్తుంటారు.

కొందరు సీజన్ తో పని లేకుండా తరచూ కీరదోసకాయను తీసుకుంటారు.ముఖ్యంగా జ్యూసులు, స్మూతీలు, సలాడ్స్ లో కీర దోసకాయను విరివిరిగా వాడేవారు ఎంద‌రో ఉన్నాయి.

అయితే చలికాలంలో కీర దోసకాయ తినవచ్చా.? తినకూడదా.? అనే డౌట్ చాలా మందికి ఉంది.ఎందుకంటే ఈ సీజన్ లో కొందరు వాటరీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను తీసుకుంటే జలుబు చేస్తుంద‌ని భావిస్తారు.

ఈ క్ర‌మంలోనే ఆ త‌ర‌హా ఫుడ్స్ ను అవైడ్ చేస్తుంటారు.కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో కీర దోసకాయను నిశ్చింతగా తినొచ్చు.వాస్తవానికి ఈ సీజన్ లో కీరదోసకాయను తినడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయ‌ని కూడా అంటున్నారు.చలికాలంలో చాలా మంది బద్ధకం కారణంగా వ్యాయామం చేయరు.

Advertisement

దీంతో బరువు అదుపు తప్పుతుంది.అయితే కీర దోసకాయని తీసుకుంటే మీ బాడీ వెయిట్ మీ కంట్రోల్ లో ఉంటుంది.

అలాగే త‌ర‌చూ వాస్ రూమ్‌కి వెళ్లాల్సి వ‌స్తుంద‌నే కార‌ణంతో కొంద‌రు చలికాలంలో వాటర్ తాగడం మానేస్తుంటారు.దీని కారణంగా బాడీ డీహైడ్రేట్( Dehydrate ) అవుతుంది.ఫ‌లితంగా ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

కీర దోసకాయ తీసుకుంటే ఆ సమస్య ఉండదు.వాట‌ర్ ఎక్కువ తాగ‌ని వారు కీర‌దోస‌కాయ‌ను ఎంపిక చేసుకోవ‌డం ఉత్త‌మం.

ఇక కీర దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) రిచ్ గా ఉంటాయి.అందువల్ల ఈ కూరగాయను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.దీంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అంతేకాదు కీర దోసకాయను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.జీర్ణక్రియ చురుగ్గా పనిచేస్తుంది.

Advertisement

మరియు చర్మం కూడా తేమగా కాంతివంతంగా ఉంటుంది.కాబట్టి చలికాలంలో పొరపాటున కూడా కీరదోసకాయను దూరం పెట్టొద్దు.

తాజా వార్తలు