విశ్వక్ సేన్ ప్రస్తుత పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందా ?

విశ్వక్ సేన్.చాలామంది హీరోలకి విశ్వక్ సేన్ కి అనేక తేడాలు ఉన్నాయి.

అసలే మన టాలీవుడ్ హీరోయిజంతో నిండిపోయింది.దానికి తోడు బీభత్సమైన ఆటిట్యూడ్ ఇన్ హీరోగా విశ్వక్ సేన్ కి పేరు వచ్చింది.

మొదటి సినిమా నుంచి తనది సపరేట్ రూట్.సినిమా తీయడం లోనూ ఆ సినిమాను ప్రమోషన్ చేసుకోవడంలోనూ విశ్వక్ సేన్ కి వైవిధ్యమైన వైఖరి ఉంటుంది.

నా సినిమా నాకు నచ్చినట్టు తీసుకుంటా, నాకు నచ్చిందే చేస్తా అనే టైపులో అతని ప్రవర్తన ఉంటుంది కానీ అది అందరితో కుదరదు కదా.అందుకే మొన్నటికి మొన్న 30 ఏళ్లుగా మౌన మూనిలా ఉన్న అర్జున్ చేత గేట్ ఔట్ అని అనిపించుకున్నాడు.పైగా అతడితో సినిమా అంటే దర్శకుడు ఎవరు ఉండాలో అతడే డిసైడ్ చేస్తాడు.

Advertisement

సంగీతం మాటలు పాటలు ఫైట్లు ప్రతి విషయం విశ్వక్ సేన్ చెప్పినట్టే జరగాలి.

మరి ఇతగాడు తీస్తున్న ప్రతి సినిమా హిట్ అవుతుందా అంటే అది లేదు.గత కొన్ని సినిమాల పరిస్థితి చూస్తే అది అందరికీ అర్థం అవుతుంది.ఆటిట్యూడ్ ఉండడం తప్పు కాదు కానీ అది సినిమాకు ఎఫెక్ట్ అవనంత వరకు ఇబ్బంది లేదు కానీ అన్నిట్లో వేలు పెట్టి తను చెప్పినట్టే జరగాలి అనే వైఖరి ఉండటమే అసలు సమస్య.

విశ్వక్ సేన్ కి మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇలాగే ఉన్నారు.అందరికన్నా ఒక మెట్టు పైన ఉన్నాడు విశ్వక్ సేన్.ఇక అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడం ఒక వంతు అయితే, అడగాల్సిన అవసరం లేకుండా ఏదో ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాడు ప్రతి సినిమాకి.

ఇది చాలామంది హీరోలకు షరా మామూలే అయినా నిర్మాత సొంతంగా ఒక ఆఫీస్ బాయ్ ని కూడా పెట్టుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారు రాను రాను మన తెలుగు హీరోలు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇక అర్జున్ అయితే తన సినిమా నుంచి గెటవుట్ అన్న తర్వాత టీవీ9 స్టూడియోలో మరోసారి గెటవుట్ అనిపించుకున్నాడు విశ్వక్ సేన్.మొత్తానికి ఎలాంటి ఇమేజ్ కావాలో కూడా తానే సృష్టించుకున్న విశ్వక్ సేన్ పరిస్థితి ప్రస్తుతం కింద మీద ఉన్నట్టుగా ఉంది.ఇంత చెడ్డ పేరు మూట పట్టుకొని అతని తీస్తున్న సినిమాలు కూడా అంతగా ఏమీ లేవు.

Advertisement

అతడి స్థానంలో అర్జున్ మోహన్ లాల్ నీ హీరోగా పెట్టుకుని సినిమా చేస్తున్నాడు.మోహన్ లాల్ ఎలాంటి బిల్డప్ లకి వెళ్ళడు సరి కదా, సెట్ లో ఉంటే ఉన్నాడా లేడా అన్న విధంగా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు.

తాజా వార్తలు