ఇదేందయ్యా ఇది: చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో విచిత్రమైన, ఆశ్చర్యకరమైన ఘటనల వీడియోలు వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా ఊహించని పరిణామాలతో కూడిన వీడియోలు ప్రజలను నవ్వించడమే కాదు.

ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తున్నాయి.కొన్ని వీడియోలు నమ్మశక్యం కాని పరిస్థితులను చూపిస్తే, మరికొన్ని అసాధ్యాన్ని సాధ్యంగా మార్చినట్లుగా అనిపిస్తాయి.

అచ్చం అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.చితిపై నిప్పు పెట్టిన తర్వాత మృతుడు బతికొచ్చిన ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లిన కుటుంబసభ్యులు, సంప్రదాయ ప్రకారం కట్టెలను పేర్చి ఆపై అతని శరీరాన్ని ఉంచారు.అనంతరం చితికి నిప్పు(Fire in the fireplace) పెట్టారు.

Advertisement

ఇదంతా సాధారణ ప్రక్రియే.కానీ, అసలు షాకింగ్ ఘటన అప్పుడే జరిగింది.

అప్పటివరకు పూర్తిగా నిశ్చలంగా ఉన్న మృతదేహం మంటలు(Dead body burns) అంటుకోగానే ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది.అంతేకాదు, చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచి కిందకు పరుగెత్తాడు.

ఈ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్యపోయారు.కొందరు భయంతో పరుగులు పెట్టగా.

మరికొందరు తమ ఫోన్లలో ఈ ఘటనను వీడియో తీసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, మంగళవారం, 2022

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఘటన నిజంగా మిరాకిల్ అంటారా? లేక డాక్టర్ల వైద్య పరీక్షల్లో ఏదైనా తప్పిదం జరిగిందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి.సాధారణంగా, కొన్ని తీవ్రమైన షాక్‌ లకు లోనైన వ్యక్తులు తాత్కాలికంగా స్పందన కోల్పోతారు.

Advertisement

అలాంటి సందర్భాల్లో వారికి మృతులుగా భావించే అవకాశం ఉంటుంది.ఈ ఘటన కూడా అదే తరహా సంఘటన కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా, ఈ వైరల్ వీడియో నెటిజన్లకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా, ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.

తాజా వార్తలు