ఆసీస్ అభిమానులు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలపై సచిన్ ఏమన్నాడంటే?

ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు సమయంలో మన భారత క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాబౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఆసీస్ అభిమానులు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపాయి.

వరుసగా రెండు రోజులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో సిరాజ్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది.

అయితే ఆసీస్ అభిమానులు చేసిన సిరాజ్, బుమ్రాపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.ఆటలో ఆటగాళ్ల రంగు, కుల మతాలతో సంబంధం లేదని, ఆటలు ఎప్పుడూ కూడా అందరినీ కలుపుతాయని, మనుషులను విడదీయవని తెలిపారు.

What Did Sachin Say About The Racist Remarks Made By Aussie Fans?, Sachin Tendu

క్రికెట్ లో ప్రతిభకే మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, వివక్ష చూపే సంస్కృతి క్రికెట్ లో లేదని, ఇలాంటి విషయాలపై అవగాహన లేని వారికి క్రికెట్ లో కొనసాగే అర్హత లేదని సచిన్ టెండూల్కర్ అన్నారు.ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఖండించాలని సచిన్ అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు