మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ ఏం సాధించారో చెప్పాలి..: ఎంపీ మార్గాని భరత్

టీడీపీ నేత నారా లోకేశ్ పై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఒళ్లు తగ్గించుకోవడానికి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే ప్రజలు పడుకున్నాక చేసే యాత్రను ఏమంటారని ఆయన ప్రశ్నించారు.మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ ఏం సాధించారో చెప్పాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.

రాష్ట్రంలోని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు.ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తారా అన్నది టీడీపీ చెప్పాలన్న ఆయన పెన్షన్లకు, ఇన్సూరెన్స్ పథకానికి తేడా ఏంటో కూడా లోకేశ్ కు తెలియదని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే సీఎం జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదని సూచించారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు