వేగములు ఎన్ని, అవి ఏవి?

వేగాలు మొత్తం ఆరు రకాలు.అవి వాగ్వేగం, మనోవేగం, క్రోధ వేగం, జిహ్వ వేగం, ఉదర వేగం, జననేంద్రియ వేగం.

1.వాగ్వేగం :

వాక్ శక్తి అమోఘమైనది.దాన్ని వృథా చేయరాదని మృదు వగుమాటే జపమని, తపమని శాస్త్రం చెబుతోంది.పరుష వాక్కులు పలకడం, అసత్యం చెప్పడం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసంబద్ద ప్రలాపా లాడడం ఈనాల్గువాగ్దేషాలు.

2.మనోవేగం:

మనోవేగం పట్టరానిది, అనంత మైనశక్తి కలది.స్వర్గానికి, నరకానికి మనస్సేమూలం.

ఇంద్రుడు, నహుషుడు మున్నగు వారు మనోవేగంవల్ల తమతమ అస్తిత్వాలను కోల్పోయారు.అత్యంత నిష్టాగరిష్ఠుడైనప్పటికీ ప్రవరాఖ్యుడు మనోవేగంవల్ల హిమాలయా లకుచేరి మనోక్లేశాన్ని పొందాడు.కావున, మనోవేగాన్ని నియంత్రించు కోవాలి.

3.క్రోధవేగం :

ఇది మహా ప్రమాధికారి.కామ క్రోధ లోభాలు మూడు నరక ద్వారాలని గీతా సందేశం.

మానవునిలో ఉన్న జ్ఞానమనే రత్నాలను తస్కరించడానికి కామక్రోధ లోభాలు దేహంలో తిష్ఠవేసుకుని ఉంటాయి.కావున జాగ్రత్త పడమని శ్రీ శంకరులు బోధించారు.

What Are The Speeds What Are They Details, Vegalu Importance, Speeds, Speeds In
Advertisement
What Are The Speeds What Are They Details, Vegalu Importance, Speeds, Speeds In

4.జిహ్వా వేగము :

నాలుక రెండు విధాలుగా పనిచేస్తుంది.రుచులు గ్రహించడం, మాట్లాడడం, ఈ రెండు పనుల్లోనూ వేగాన్ని కలిగి ఉంటుంది.

మంచి మాటలచే సిరి సంపదలు, బంధు బలగం సమకూరుతాయి.కాబట్టి జిహ్వా వేగాన్ని వశము నందుంచుకోవాలి.

5.ఉదరవేగం:

అమితాహారం హాని కలిగిస్తుందని, అల్పాహారం మేలు చేస్తుందని ఋషుల వాక్కు.తినకూడని పదార్థాలను తామ సాహారాలను విడనాడాలని సుభాషితం చెబుతోంది.

యుక్తాహార విహారస్యయుక్తమైన ఆహార విహారాలు ఉండాలని గీతా సందేశం.కాబట్టి తినడం కోసం జీవించడం కాదని, జీవించడం కోసమే తినాలని పెద్దల మాట.

What Are The Speeds What Are They Details, Vegalu Importance, Speeds, Speeds In

6.జననేంద్రియ వేగం :

ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిఉండాలి.కామవేగాన్ని అణుచుకోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

“మరణం బిందుపాతేనే, జీవనం బిందుధారణాత్" మితి మీరిన వీర్యపతనంవల్ల ఆయువు తరుగునని దానిని నిల్పుకున్నచో ముఖ వర్చస్సు తేజస్సు, మేధస్సు ఆయుస్సు వృద్ధి చెందుతాయని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్ర వచనం.సౌరభ ముని నదిలో స్నానం చేస్తుండగా.

Advertisement

రెండు మత్స్యాలని చూసి మనోవికారం చెంది తపో భ్రష్టుడైనాడు.కాబట్టి జననేంద్రియ వేగాన్ని అరికట్టాలి.

తాజా వార్తలు