మీ పిల్ల‌లు హైట్ పెర‌గ‌ట్లేదా.. కార‌ణాలేంటో తెలుసా?

సాధార‌ణంగా కొంద‌రు పిల్ల‌లు చాలా పొట్టిగా ఉంటారు.ఏజ్‌, వెయిట్ కు త‌గ్గ హైట్ ( Height )ఉండ‌రు.

దాంతో త‌ల్లిదండ్రులు ఎంత‌గానో క‌ల‌వ‌రప‌డుతూ ఉంటారు.అయితే పోషకాహార లోప‌మే పిల్ల‌లు హైట్ పెర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని అనుకుంటారు.

కానీ పోష‌కాల కొర‌త‌తో పాటు మ‌రెన్నో అంశాలు పిల్ల‌ల ఎత్తును ప్ర‌భావితం చేస్తాయి.ప్ర‌ధానంగా చూసుకుంటే హార్మోన్ల అసమతుల్యత.

గ్రోత్ హార్మోన్( Growth hormone ) తక్కువగా ఉత్పత్తి అయితే, పిల్లలు స‌రిగ్గా ఎత్తు పెర‌గ‌రు.థైరాయిడ్ హార్మోన్ల లోపం కూడా ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

Advertisement

అలాగే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది పిల్ల‌లు టీవీల‌కు, స్మార్ట్‌ఫోన్ల‌కు అతుక్కుపోతూ రాత్రుళ్లు నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నారు.పిల్లలకు రోజుకు కనీసం ఎనిమిది నుంచి ప‌ది గంటలు నిద్ర అవసరం.

కంటి నిండా నిద్రలేకపోతే గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాదు.ఫ‌లితంగా ఎదుగుదల నెమ్మదిస్తుంది.

జంక్ ఫుడ్ తినడం, చిన్న‌వ‌య‌సులోనే స్మోకింగ్ ను అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల కూడా పిల్లల ఎత్తు ప్ర‌భావితం అవుతుంది. అస్తమా, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలు ( Asthma, heart diseases, chronic indigestion problems )పిల్లల ఎదుగుదలను నెమ్మదించేలా చేస్తాయి.

శరీరానికి స‌రైన శ్ర‌మ లేకుంటే పిల్ల‌ల ఎదుగుద‌ల కూడా అంతంత మాత్రంగానే ఉంది.కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, జింక్ ( Calcium, protein, vitamin D, zinc )వంటి పోష‌కాలు స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి పిల్ల‌ల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.కాబ‌ట్టి, మీ పిల్ల‌లు ఏజ్ మ‌రియు వెయిట్ కు త‌గ్గ‌ట్లు బ‌రువు పెర‌గాలంటే సరైన పోషకాహారం ఇవ్వండి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

గేమ్స్‌, వాకింగ్, జంపింగ్, యోగా లాంటి శారీరక వ్యాయామాలు పిల్లలకు అల‌వాటు చేయండి.

Advertisement

పిల్లలు మానసికంగా ప్ర‌శాంతంగా ఉండేలా చూసుకునే బాధ్య‌తను త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క తీసుకోవాలి.పిల్ల‌ల‌తో స‌మ‌యం గ‌డ‌పాలి.వారితో ఆట‌లు ఆడాలి.

అలాగే పిల్ల‌లకు సరైన నిద్ర ఎంతో ముఖ్యం.కాబ‌ట్టి టీవీ, మొబైల్ నుంచి పిల్ల‌ల‌ను దూరంగా ఉంచండి.

రాత్రుళ్లు త్వ‌ర‌గా ప‌డుకునేలా జాగ్ర‌త‌లు తీసుకోండి.

తాజా వార్తలు