ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త!

అలారం( Alarm ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.మనలో చాలా మంది రోజు ‌ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తుంటారు.

ఒకప్పుడు కోడి కూతలే ప్రజలకు అలారం.కానీ ప్రస్తుత రోజుల్లో మనల్ని నిద్ర లేపడానికి ప్రత్యేకంగా అలారాలు వచ్చాయి.

ప్రతి ఒక్కరి ఫోన్ లో అలారం ఉంటుంది.ఏదైనా ముఖ్యమైన పని ఉన్న రోజు ఉదయాన్నే లేవ‌డానికి అలారం పెట్టుకునే వారు కొందరైతే.

ప్రతినిత్యం అలారం పెట్టుకున్న నిద్రలేచేవారు మరికొందరు.ముఖ్యంగా ఆడవారు ఇంటి పనులు, వంట పనులు పూర్తి చేసి పిల్లలను స్కూల్ కి పంపించడానికి, భర్తను ఉద్యోగానికి పంపించడానికి ప్రతినిత్యం అలారం పెట్టుకునే నిద్ర లేస్తూ ఉంటారు.

Advertisement
What Are The Negative Effects Of Alarm Details, Alarm, Alarm Sound, Sleeping, W

అలవాటు మీకు ఉందా.? అయితే కచ్చితంగా మానుకోండి.అలారం పెట్టుకుని బలవంతంగా నిద్ర లేవడం( Wake Up ) ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని పలు అధ్యయనాలు తేల్చాయి.

అలారం శబ్దంతో( Alarm Sound ) అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల రక్తపోటు మరియు హృదయ స్పందన రేటు లో సాధారణం కంటే పెద్ద స్పైక్‌ ఏర్పడుతుంది.ఇది కొంతమందిలో గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సమస్యను ప్రేరేపిస్తుంది.

What Are The Negative Effects Of Alarm Details, Alarm, Alarm Sound, Sleeping, W

అలాగే అలారం ధ్వని మన ఒత్తిడి స్థాయిలను ప్రేరేపించ గలదని అధ్యయనాలు చెబుతున్నాయి.ఒత్తిడితో నిద్రలేస్తే దాని ప్రభావం ఆరోజు మొత్తంపై పడుతుంది.కాబ‌ట్టి అలారం పెట్టుకుని నిద్రలేచే అలవాటు ఉంటే కచ్చితంగా మానుకోండి.

అలారం పై ఆధారపడడం మెల్లమెల్లగా తగ్గించుకోండి.అలారం అలవాటును మానుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది

What Are The Negative Effects Of Alarm Details, Alarm, Alarm Sound, Sleeping, W
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

కష్టమైనా కూడా న్యాచురల్ గా నిద్ర లేచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టండి.అలారం పెట్టుకోవడానికి బదులుగా సన్ లైట్( Sunlight ) పడే ప్రదేశంలో బెడ్ వేసుకుని నిద్రించండి.మీ నిద్ర వాతావరణాన్ని ఆప్టిమైజ్ చేయండి.

Advertisement

పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి.స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను( Sleep Schedule ) ఏర్పాటు చేయండి.

ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా రోజు ఒక టైం కు పడుకోవడం, ఒక టైం కి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.నిత్యం వ్యాయామం చేయండి.

మంచి ఆహారం తీసుకోండి.తద్వారా అలారం అవసరం లేకుండానే మీరు ఉదయం నిద్ర లేస్తారు.

తాజా వార్తలు