ప్ర‌తిరోజు ఖర్జూరం తింటే ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా??

య‌మ్మీ య‌మ్మీగా ఉండే ఖర్జూరం గురించి తెలియని వారుండ‌రు.ఈ ఖ‌ర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉండ‌డ‌మే కాదు.

ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సాధార‌ణంగా చాలా మంది ఖర్జూరాన్ని చక్కెరకు బదులుగా వాడుతూంటారు.

అనేక వంటకాల్లో కూడా యూజ్ చేస్తారు.అయితే ర‌క్త‌హీన‌తో బాధ‌ప‌డే వారు ఖ‌ర్జూరం తిసుకుంటే చాలా మంది.

ఎందుకంటే.ఖర్జూర పండులో ఉంటే ఇనుము రక్తహీనత స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది.

Advertisement

ఖర్జూరంలో క్యాలరీలు తక్కువ మరియు ఎనర్జీ ఎక్కువ.అందుకే ఇవి తిన‌డం వ‌ల్ల శరీరానికి తక్షణ ఎనర్జిని అందిస్తుంది.

అదే స‌మ‌యంలో బ‌రువు త‌గ్గ‌డానికి కూడా ఖ‌ర్జూరం స‌హాయ‌ప‌డుతుంది.అలాగే ప్ర‌తిరోజు మూడు నుంచి ఐదు ఖ‌ర్జూరాలు తింటే.

ర‌క్త‌పోటుతో పాటు గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ ని తగ్గిస్తుంది.

అదేవిధంగా, నిద్రలేమి సమస్యతో బాధ‌ప‌డుతున్న‌వారు పాల‌లో ఖ‌ర్జూరం నాన‌బెట్టి.తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.ఖర్జూరాలలో సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ పుష్కలంగా ఉంటాయి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇవి ఎముకల బ‌లానికి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రియు ఖర్జూరంలో ఉండే ప్రోటీన్స్, మరియు ఎంజైమ్స్ చర్మంను ఆరోగ్యంగా, ప్ర‌కాశ‌వంతంగా ఉంచుతుంది.

Advertisement

అలాగే ఖ‌ర్జూరంలో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది.ఇది బ్రెయిన్ చురుగ్గా ఉండేలా చేస్తుంది.

మ‌రియు బ్రెయిన్ కు కావల్సిన న్యూట్రీషియన్స్ కూడా అందిస్తుంది.కాబ‌ట్టి, ప్ర‌తిరోజు ఖర్జూరం తినాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు