పంటి నొప్పికి కార‌ణాలేంటి.. దాని నుంచి ఎలా రిలీఫ్ పొందొచ్చు..?

పంటి నొప్పి.( Toothache ) పళ్ళలో లేదా చిగుళ్లలో కనిపించే అసౌకర్యం.

పంటి నొప్పి చిన్న స‌మ‌స్య‌గానే అనిపించినా.దాన్ని భ‌రించ‌డం మాత్రం ఎంతో బాధాక‌రంగా ఉంటుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే అంద‌రిలోనూ పంటి నొప్పికి ఒకే ర‌క‌మైన కార‌ణాలు ఉండ‌వు.పళ్ళలో బాక్టీరియా పెరుగుదల, కావిటీస్‌, చిగుళ్లలో వాపు లేదా రక్తస్రావం, పళ్ళకు గాయాలు లేదా పగుళ్లు రావడం, గమ్ ఇన్ఫెక్షన్, దంత క్షయం త‌దిత‌ర అంశాలు పంటి నొప్పికి కార‌ణం అవుతుంటాయి.

అయితే పంటి నొప్పి నుంచి రిలీఫ్ పొంద‌డానికి ప‌లు ఇంటి చిట్కాలు చాలా ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డ‌తాయి.వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
What Are The Causes Of Toothache And How To Get Relief From It Details, Toothach

అల్లం( Ginger ) మరియు వెల్లుల్లి( Garlic ) ఈ రెండింటి కాంబినేష‌న్ పంటి నొప్పి నివార‌ణ‌లో స‌హాయ‌ప‌డుతుంది.అల్లం మ‌రియు వెల్లుల్లి ముద్ద‌ను నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే.

వాటిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను పంటి నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

What Are The Causes Of Toothache And How To Get Relief From It Details, Toothach

అలాగే పుదీనా ఆకులు( Mint Leaves ) పంటి నొప్పిని తగ్గించగ‌ల‌వు.పుదీనా ఆకుల్లో మెంతాల్ అనే సహజ రసాయనం ఉంటుంది, ఇది నొప్పిని శాంతింప జేసే లక్షణాలు కలిగి ఉంటుంది.పైగా వాపును తగ్గించే గుణాలు కూడా పుదీనాకు ఉన్నాయి.

అందువ‌ల్ల పంటి నొప్పితో బాధ‌ప‌డుతున్న‌వారు పుదీనా తాజా ఆకులను తినండి లేదా మెత్తగా ముద్ద చేసి నొప్పి ఉన్న చోట రాయండి.పుదీనా ఆకులతో టీ తయారు చేసి కూడా తీసుకోవ‌చ్చు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

పుదీనా టీ నోటిలో ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.

What Are The Causes Of Toothache And How To Get Relief From It Details, Toothach
Advertisement

పంటి నొప్పితో బాగా ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలిపి నోటిలో గార్గిల్ చేయండి.ఇది ఇన్ఫెక్షన్‌ను తగ్గించి నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది.అలాగే ఒక క్లాత్ తో ఐస్ కట్టి బయట నుంచి పళ్లు నొప్పి ఉన్న చోట ఉంచండి.

వాపు తగ్గేందుకు ఇది ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.ఇక ఈ చిట్కాలు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే.

పంటి నొప్పి చాలా తీవ్రంగా ఉన్నా లేదా మళ్ళీ మళ్ళీ వస్తున్నా క‌చ్చితంగా దంతవైద్యులను సంప్రదించండి.

తాజా వార్తలు