వెన్ను నొప్పికి కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలి..?

వెన్ను నొప్పి.ఆడ‌, మ‌డ అనే తేడా లేకుండా చాలా మందికి క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య‌.

అయితే వెన్ను నొప్పి వేధిస్తున్న‌ప్పుడు ఎక్కువ శాతం మంది పెయిన్ కిల్ల‌ర్ వేసుకుని ఊరుకుంటారు.కానీ, అస‌లు వెన్ను నొప్పికి కార‌ణాలేంటి.? ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలి.? అన్న విష‌యాల గురించి మాత్రం ఆలోచించరు.నిజానికి వెన్ను నొప్పికి కార‌ణాలు అనేకం.

ప్ర‌ధానంగా చూసుకుంటే అధిక బరువు, ఎక్కువసేపు వంగి కూర్చోవడం లేదా నిలబడటం, రెస్ట్ లేకుండా కంప్యూటర్ ముందు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, కండరాల బలహీనత, తప్పుడు పద్ధతిలో బరువులు ఎత్తడం వ‌ల్ల వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది.అలాగే డిస్కు సంబంధిత సమస్యలు, సైయాటికా, ఆర్థ్రైటిస్, కిడ్నీ(Sciatica, arthritis, kidney) సంబంధిత సమస్యల కార‌ణంగా కూడా వెన్ను నొప్పి రావొచ్చు.

గర్భధారణ సమయంలో, నెల‌స‌రి స‌మ‌యంలో వెన్నుపోటు రావ‌డం చాలా కామ‌న్‌.అయితే సాధార‌ణ వెన్ను నొప్పిని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా త‌గ్గించుకోవ‌చ్చు.వెన్ను నొప్పి వేధిస్తున్న‌ప్పుడు అల్లం క‌షాయం తీసుకోండి.

Advertisement
What Are The Causes Of Back Pain And How To Get Rid Of This Problem? Back Pain,

అల్లం లో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ఇవి నొప్పి నివార‌ణ‌లో అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.

What Are The Causes Of Back Pain And How To Get Rid Of This Problem Back Pain,

అలాగే ఆయిల్ మ‌సాజ్ అనేది వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి చ‌క్క‌ని మార్గం.నువ్వుల నూనెలో కొన్ని తుల‌సి ఆకులు, అల్లం మ‌రియు క‌ర్పూరం(Tulsi leaves, ginger, camphor) వేసి వేడి చేయండి.ఆపై ఆ నూనెను వెన్నుపై రాసుకుని మసాజ్ చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

నొప్పి మాయం అవుతుంది.

What Are The Causes Of Back Pain And How To Get Rid Of This Problem Back Pain,

హల్కా స్ట్రెచింగ్, యోగా ఆసనాలు వెన్నుపోటుని త‌గ్గించ‌డానికి చాలా మేలు చేస్తాయి.వెన్ను నొప్పి ఉన్న‌వారు గట్టి మెట్రెస్ పై నిద్రించడం మంచిది.అలాగే కంప్యూట‌ర్ ముందు వ‌ర్క్ చేసేట‌ప్పుడు కుర్చీలో కూర్చునే విధానంలో జాగ్ర‌త్త తీసుకోవాలి.మీ వెన్నుపూసకు మద్దతుగా చిన్న దిండు పెట్టుకోండి.90° కోణంలో మోకాళ్లు ఉండేలా చూసుకోండి.మ‌రియు ప్ర‌తి ముప్పై లేదా అర‌వై నిమిషాల‌కు ఒక్కసారి లేచి నడవాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అదే విధంగా డైట్ లో పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని చేర్చుకోండి.త‌ద్వారా సాధార‌ణ వెన్ను నొప్పి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

Advertisement

ఒక‌వేళ వెన్ను నొప్పి దీర్ఘకాలంగా మారితే క‌చ్చితంగా డాక్ట‌ర్ ను సంప్ర‌దించాలి.

తాజా వార్తలు