ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం( India ) కూడా ఒకటిగా ఉంది.
భారతదేశంలో ప్రధాన సమస్య కాలుష్యం( The main problem is pollution ).
ఎందుకంటే భారత్లో వాహనాల వినియోగం భారీగా పెరుగుతూ పోతోంది.ఈ కాలుష్యం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకే ఎలక్ట్రిక్ వాహనాలు( Electric vehicles ) మార్కెట్లోకి అడుగుపెట్టాయి.ఒక్క భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
: ఎలక్ట్రిక్ వాహనాలు కార్బన్ మోనాక్సైడ్( Carbon monoxide ) లాంటి కాలుష్య కారకాలను విడుదల చేయవు.కాబట్టి సాంప్రదాయ ఇంజన్లను ఈవీ లతో భర్తీ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం చాలావరకు తగ్గినట్టే.
: ఎలక్ట్రిక్ వాహనరంగం మరింత బలపడితే వాయు కాలుష్యం తగ్గడం, గ్రీన్ హౌస్ వాయు( Green house gas ) ఉద్గారాలు తగ్గడం జరుగుతుంది.ముఖ్యంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలో ఈవీ లు కీలక పాత్ర పోషిస్తాయి.
: పెట్రోల్, డీజిల్( Petrol, Diesel ) తో పనిచేసే ఇంజన్లు ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.కానీ ఎలక్ట్రిక్ వాహనాల ఇంజన్లు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.
కాబట్టి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.ముఖ్యంగా జనాల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో శబ్ద కాలుష్యం నివారించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సరైనవి.
: వాహనాల నుండి వచ్చే కాలుష్యం వల్ల శ్వాస కోశ, హృదయ( Respiratory system, heart ) సంబంధిత వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిందే.వాహనాల నుండి వెలువడే దట్టమైన పొగ దాదాపుగా విషంతో సమానం.అదే ఎలక్ట్రిక్ వాహనాల నుండి ఎటువంటి పొగలు రావు కాబట్టి ప్రజల ఆరోగ్యం మెరుగు గానే ఉంటుంది.
ఒకవైపు పర్యావరణాన్ని.మరొకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రస్తుత పరిస్థితులలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అత్యవసరంగా మారింది.
ప్రభుత్వం, వాహన రంగా సంస్థలు ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాయి.భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
తద్వారా కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy