కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఇవే..!

కొన్ని వ్యాధులు ముఖ్యంగా చర్మం, ఎముకలు, కీళ్లు కండరాలు వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్‌( Collagen ) అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి.

ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమూహాన్ని కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌ అని పిలుస్తారు.

కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌ లో ముఖ్యమైనది లూపోస్ వ్యాధి ( Lupus disease )అని నిపుణులు చెబుతున్నారు.లూపస్ అంటే తోడేలు అని అర్థం వస్తుంది.

ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలు లా కనిపించే అవకాశం ఉంది.కాబట్టి దీన్ని లూపస్ అని పిలుస్తారు.

అలాగే రుమటాయిడ్, ఆర్థరైటిస్, చిన్న కీళ్ల పై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

What Are Collagen Vascular Diseases Its Features Are These , Lupus Disease, Col
Advertisement
What Are Collagen Vascular Diseases Its Features Are These , Lupus Disease, Col

అలాగే లూపాస్( Lupus ) లో కనిపించే ఈ ర్యాష్‌ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరుగుతుంది.కొందరిలో వెంట్రుక మూలాలు మూసుకుపోతాయి.ఇది ముఖ్యంగా చేతులు, ముఖం మీద వస్తుంది.

అలాగే కొన్ని సార్లు ఒళ్లంతా కూడా ర్యాష్‌,అలాగే జ్వరం వస్తూ ఉంటుంది.బరువు తగ్గిపోతారు.కొందరిలో జుట్టు కూడా రాలిపోతుంది.

మరి కొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు ఏర్పడతాయి.అలాగే మరి కొందరిలో డిప్రెషన్ తో ఉద్వేగానికి లోనవుతారు.

దాంతో దీన్ని ఒక మానసిక వ్యాధి అని కూడా అంటారు.కొంత మందిలో ఫిట్స్ కూడా వస్తాయి.

What Are Collagen Vascular Diseases Its Features Are These , Lupus Disease, Col
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

రుమటాయిడ్, ఆర్థరైటిస్ ( Rheumatoid, arthritis )తో పాటు మిగతా వాస్క్యులార్‌ జబ్బుల లక్షణాలు కూడా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే అరుదుగా కొందరిలో కళ్ళల్లో రక్తపోటు పెరగడంతో గ్లూకోమాకు దారి తీస్తుంది.ఈ వ్యాధి చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానమైన సమస్యలైనా ఎస్‌ఎల్‌ఈ, రుమటాయిడ్ అర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల దగ్గర తగిన చికిత్స తీసుకోవాలి.డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు ప్రెడ్నిసలోన్‌ వంటి స్టెరాయిడ్స్‌ ఇస్తూ చికిత్స చేస్తూ ఉంటారు.

ఈ చికిత్సను ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు