వామ్మో, ఈ పిల్లి ఏంటి కొండముచ్చులా ఉంది.. వీడియో చూస్తే షాకే!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్య పరుస్తాయి.తాజాగా అలాంటి ఓ ఆశ్చర్యపరిచే వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక పిల్లి చాలా వింతగా కనిపించింది.దీన్ని చూస్తే అది కొండముచ్చో లేక పిల్లో అనేది గుర్తించడం కూడా కష్టమే.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అబ్బురపడుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో క్యాట్ స్టాండ్ పైన పిల్లి కూర్చున్నట్లు మీరు గమనించవచ్చు.

పిల్లి శరీరం అంతటా ఉన్న బొచ్చు తెల్ల కలర్ లో ఉండగా మొహం మాత్రం నల్లగా ఉంది.దీంతో ఇది చూసేందుకు అచ్చం ఒక కొండముచ్చు లాగానే కనిపించింది.

Advertisement

దీనికి తోడు దీని తోక కూడా చాలా పొడుగ్గా ఒక కొండముచ్చు లాగానే ఉంది.ఈ పిల్లి పేరు రిచీ అని ఇన్‌స్టాగ్రామ్ పేజీ పేర్కొంది.

ఈ వెరైటీ క్యాట్ మైనే కూన్ అనే పెద్ద పెంపుడు పిల్లి జాతికి చెందినది.ఇది ఉత్తర అమెరికాలోని ప్రాచీన కాలం నాటి సహజ పిల్లి జాతులలో ఒకటి.వీటి చెవులతో పాటు బాడీ కూడా చాలా పెద్దగా ఉంటుంది.

చలికాలంలో చలి పెట్టకుండావీటి బొచ్చు చాలా దట్టంగా ఉంటుంది.ఇది కాస్త భయానకంగా కనిపించినా సాధారణ పిల్లుల లాగానే యజమానులతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటుంది.

అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైకులు, కోటికిపైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు భయపడుతుంటే ఉంటే.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

క్యాట్ లవర్స్ మాత్రం బ్యూటిఫుల్, అమేజింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు