బి‌ఆర్‌ఎస్ పై అవినీతి అస్త్రాలు.. రెడీ ?

బి‌ఆర్‌ఎస్ పై అవినీతి అస్త్రాలు సంధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోందా ? కే‌సి‌ఆర్ కుటుంబమే టార్గెట్ గా వ్యూహాలకు పదును పెడుతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ముందు బి‌ఆర్‌ఎస్ పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తు వచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల కుంభకోణం, ధరణిలో అవినీతి.ఇలా చాలా వాటిపైనే బి‌ఆర్‌ఎస్ పై వేలెత్తి చూపిస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు.

దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరియు ధరణి పై ఎంక్వైరీ వేసే అవకాశం ఉందని భావించారంతా.

కానీ సి‌ఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )వాటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో అసలు ఎంక్వైరీ ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.తాజాగా అసెంబ్లీలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే గత ప్రభుత్వం పై చర్యలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ప్రజలు పూర్తిగా మార్పుకోరుకున్నట్లు ఎన్నికలతో రుజువైందని చెప్తూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తప్పవని గవర్నర్ తమిళ్ సై( Governor Tamil Sai ) వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని, అలాగే ధరణి పోర్టల్ ( Dharani Portal )రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకోస్తామని గవర్నర్ చెప్పుకొచ్చారు.

దీన్ని బట్టి చూస్తే ధరణి మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ గట్టిగానే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించింది.దాదాపు రూ.80 వేల కోట్ల వ్యయంతో రూపొందిన కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రధాన విమర్శ.ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే అవినీతి బయట పడే అవకాశం ఉందా లేదా? డిల్లీ లిక్కర్ స్కామ్ మాదిరి మరుగున పడే అవకాశం ఉందా అనే సందేహాలు కూడా చాలమందిలో వ్యక్తమౌతున్నాయి.ఏది ఏమైనప్పటికి బి‌ఆర్‌ఎస్ పై అవినీతి అస్త్రాలు ప్రయోగించేందుకు కాంగ్రెస్ రెడీగానే ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది.

Advertisement

తాజా వార్తలు