ఏపీలో దివ్యాంగులకు చేయూతనిస్తాం..: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

దివ్యాంగుల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని మండిపడిన పవన్ కల్యాణ్ వారికి రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఫించన్లు కూడా అందడం లేదని ఆరోపించారు.ఈ క్రమంలోనే జనసేన - టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పారు.

ఫించన్లు అందించడంతో పాటు చేయూతను ఇస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగానే దివ్యాంగుల ప్రతిభాపాటవాలను గుర్తిస్తే అద్భుతంగా రాణిస్తారని జనసేనాని అన్నారు.

విద్య, ఉపాధి కల్పనల్లో వారిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?