ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం..: మంత్రి పొంగులేటి

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ధరణిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం భూములను దోచేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు.ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

అందులోని తప్పులను సరిదిద్దుతామని పేర్కొన్నారు.ధరణిని ప్రభుత్వ ఆస్తులు, సామాన్యుల ఆస్తికి రక్షణగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.

అధికారంతో విర్రవీగిన బీఆర్ఎస్ ను ప్రజలు బంగాళాఖాతంలో పడేశారన్నారు.ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదన్న పొంగులేటి తప్పు చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు