Krishna Shivaji : అప్పటికి ఎప్పటికి ఛత్రపతి శివాజీ అంటే మనకు ఒక్కరే !

కొన్ని సార్లు కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే బాగుంటాయి.ఆ పాత్రను ఎవరు చేసిన మనం ఒప్పుకోలేం.

అలాంటి కొన్ని పాత్రలకు పెట్టింది పేరు కృష్ణ.అయన చేసిన అల్లూరి సీత రామ రాజు పాత్ర మరెవరు చేసిన ప్రేక్షకులు ఒప్పుకోరు.

ఇక అదే దోవలో అయన చేసిన ఛత్రపతి శివాజీ పాత్ర కూడా.తెలుగు ప్రేక్షకులకు తెలిసిన శివాజీ కేవలం కృష్ణ మాత్రమే.

ఆ పాత్ర కూడా అయన ఏ సినిమాలోనూ పూర్తి స్థాయిగా పోషించలేదు.అక్కడక్కడా తక్కువ నిడివి ఉన్న కూడా తెలుగు వాడికి తెలిసిన శివాజీ కేవలం కృష్ణ మాత్రమే.

Advertisement
We Have Seen Only Krishna In Shivaji Getap , Krishna, Chhatrapati Shivaji, Senio

అయన కాకుండా ఎవరు చేసిన మనకు ఎక్కదు.సినిమా గురించి వాటి తయారీ గురించి పూర్తిగా తెలియని వారికి కూడా ఇలాంటి ఒక అభిప్రాయం ఏర్పడింది కాబట్టే అయన విజయవంతం అయ్యాడు.

ఇక సీనియర్ ఎన్టీఆర్ సైతం ఒకటి, రెండు సార్లు శివాజీ గెటప్ వేసిన కూడా అది ఆయనకు అతకలేదు.కృష్ణ లో ఉన్న అందం కానీ, చార్మింగ్ కానీ ఎన్టీఆర్ లో కనిపించలేదు.

ఇక ఇప్పుడు మరోసారి శివాజీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకచ్చింది మాత్రం అక్షయ్ కుమార్.అయన తాజాగా శివాజీ పాత్రలో కనిపించబోతున్న సినిమా వేదత్ మరాఠే వీర్ దౌల్డే సాత్.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ గెటప్ లో ఉన్న పోస్టర్ ని సినిమా యూనిట్ విడుదల చేసింది.ఈ ఫోటో బయటకు వచ్చినప్పటి నుంచి మన తెలుగు వారికి మాత్రం ఒక నీరసం వచ్చేసింది.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా తీసారా అనే అనుమానం కూడా వచ్చేలా వుంది.

We Have Seen Only Krishna In Shivaji Getap , Krishna, Chhatrapati Shivaji, Senio
Advertisement

అంత వింతగా ఉన్న శివాజీ గెటప్, మోహంలో హ్యూమర్ ముఖ కవళికలు కలిగి, ఎలాంటి తేజం లేకుండా ఉండటాన్ని చూసి అంత షాక్ అవుతున్నారు.ఇక ఇలా శివాజీ గెటప్ వేయడం అక్షయ్ కి ఇదేమి మొదటి సారి కాదు.ఇంతకు ముందు సైతం పృథ్వి రాజ్ చిత్రంలోనూ శివాజీ గెటప్ వేశారు.

వచ్చే ఎలక్షన్స్ కోసం ఇలాంటి గెటప్ వేస్తున్నారా అంటూ జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు.శివాజీ ఇలాగే ఉంటారా ? అంటే మనమేమైనా చరిత్ర చూశామా ? అందుకే ఇలా ఎలా పడితే ఆలా తీస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

తాజా వార్తలు