సాయంత్రం సమయంలో మహా శివుడికి అభిషేకం చేయడం మంచిది కాదా..?

శ్రావణమాసం శివారాధనకు ఎంతో ప్రత్యేకమైనది.శ్రావణంలో పరమశివుడు( Paramashivudu ) పూర్తి సృష్టిని సంచలితం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు.ఈ చాతుర్మాస్యం సందర్భంగా శ్రావణంలో శంకరుడికి విశేష పూజలు చేస్తారు.

శ్రావణమాసంలో చేసే శివారాధనలో కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.శివుడు అభిషేక ప్రియుడు.

ఏ సందర్భంలో అయినా శివకటాక్షానికి అభిషేకం( Abhisekam ) నిర్వహించడం చాలా మంచిది.అయితే శ్రావణమాసంలో నిర్వహించే శివాభిషేకానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

Advertisement
Water Should Be Offered To Shivling In The Evening Or Not Details, Maha Shiva, S

ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పూజ చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ పూజకు పూర్తి ఫలితం దక్కదని శాస్త్రం చెబుతోంది.

శ్రావణమాసంలో( Shravana Masam ) దేవాదిదేవుడు మహా శివుడిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.శివలింగానికి అభిషేకం చేసుకునే సమయంలో ఉత్తరం వైపున మాత్రమే అభిషేకం చేయాలి.

పార్వతీదేవి శివుడికి ఎడమ భాగం అంటే ఉత్తర దిశలో ఉంటుంది.కాబట్టి అటువైపు నుంచి అభిషేకం జరపాలి.

ముఖ్యంగా చెప్పాలంటే శివలింగానికి( Shivling ) అభిషేకం చేసే సమయంలో నిలబడి నీళ్లు సమర్పించకూడదు.హాయిగా కూర్చుని మంత్రాలు జపిస్తూ అభిషేకం జరుపుకోవాలి.

ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తో బాన పొట్టను నెల రోజుల్లో మాయం చేసుకోండి!

శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇనుము కలిగిన ఎటువంటి పాత్రను కూడా అభిషేకానికి ఉపయోగించకూడదు.శివాభిషేకానికి రాగి పాత్ర ఎంతో శ్రేష్టమైనది.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే శివలింగానికి అభిషేకం చేసేందుకు ఎప్పుడు కూడా శంఖాన్ని ఉపయోగించకూడదు.

శివలింగాన్ని అభిషేకించే సమయంలో నీటి దారులను అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తపడాలి.ఒకేసారిగా నీటితో అభిషేకించాలని గుర్తించుకోవాలి.పండితులు చెబుతున్న దాని ప్రకారం శివా పురాణంలో శివరాధన గురించి వివరణాత్మక విశ్లేషణ ఉంది.

సాయంత్రం శివలింగానికి జలాభిషేకం చేయకూడదు.ఉదయం 5 గంటల నుంచి 11 మధ్య జలాభిషేకానికి మంచి సమయం అని పండితులు చెబుతున్నారు.

జాలాభిషేకనికి కేవలం శుద్ధమైన నీటిని మాత్రమే అందుకు ఉపయోగించాలి.శివుని అనుగ్రహం కోసం చిన్నచిన్న నియమాలు పాటిస్తే చాలు అని పండితులు చెబుతున్నారు.శ్రావణ సోమవారం ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి రుద్రాభిషేక పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

గంగాజలం లేదా పాలు అభిషేకానికి ఉపయోగించవచ్చు.ఆ తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇచ్చి నమస్కారం చేయా.

పూజ తర్వాత తప్పకుండా ప్రసాదం తీసుకోవాలి.అప్పుడే పూజ పూర్తయినట్లు అని చెబుతున్నారు.

తాజా వార్తలు