ట్రంప్ పరువు తీసిన...'వాషింగ్టన్ పోస్ట్'

రెండు రోజుల క్రితం ట్రంప్ అమెరికాని ఆర్ధికంగా ఎంతో ముందుకు నడిపించాడు, ఎన్నో సంస్కరణలు చేపట్టారు, వేల ఉద్యోగాలు ఇప్పించారు అంటూ వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి విదితమే.అయితే ఈ విషయంలో ట్రంప్ పరువు తీసేలా ఇవన్నీ అబద్దాలు అంటూ రెండేళ్ళ పాలనలో ట్రంప్ అందరిని తప్పుదోవ పట్టించారు అంటూ అసత్య ప్రకటనలు చేసింది.

అంతేకాదు ప్రజా విశ్వాసాన్ని ట్రంప్ కోల్పోయారని ట్రంప్ పరువు రోడ్డుకి ఈడ్చింది వాషింగ్టన్ పోస్ట్

ట్రంప్ దాదాపు 8,158 తప్పుడు వాగ్దానాలు, అసత్య ప్రకటనలు చేసి ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారని సదరు మీడియా సంస్థ ఉతికి ఆరేసింది.ఆ మీడియా సంస్థ ఇచ్చిన ప్రకటన ప్రకారం చూస్తే.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది రోజుకి సగటున 6 తప్పుడు ఆరోపణలు చేశారుని , రెండో ఏడాది రోజుకు 17 తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది.

దాదాపు తన 100రోజుల పాలనలో చేసిన అసత్య ప్రకటనలను తాము ప్రచురించామని సదరు మీడియా సంస్థ తెలిపింది.అక్టోబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా ఓటర్లను తప్పుదోవపట్టించేందుకు 1200 అబద్దాలు చెప్పారని.వలసదారులని ఉద్దేశించి ట్రంప్ గడిచిన మూడు వారల్లలో ౩౦౦ తప్పుడు ప్రకటనలు చేశారని తెలిపింది.

దాంతో ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణ సంచలనం సృష్టిస్తోంది.మరి దీనికి వైట్ హౌస్ నుంచీ ఎలాంటి కౌంటర్ ఉంటుందో వేచి చూడాలి.

Advertisement
భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు
Advertisement

తాజా వార్తలు