థియేటర్లు అమ్మేసిన వినాయక్‌.. ఎందుకో తెలుసా!

భారీ చిత్రాలను తెరకెక్కించి భారీ దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వివి వినాయక్‌కు విశాఖపట్నంలో వి మ్యాక్స్‌ అనే పెద్ద థియేటర్‌ ఉంది.

వైజాగ్‌లో ఈ థియేటర్‌ చాలా పాపులర్‌ అయ్యింది.

వినాయక్‌ సోదరుడు ఈ థియేటర్‌ వ్యవహారాలు చూసుకునేవాడు.

తాజాగా వినాయక్‌ ఈ థియేటర్‌ను విక్రయించినట్టు తెలుస్తోంది.ఓ హైపర్‌ మార్కెట్‌ సంస్థకు ఈ థియేటర్‌ను వినాయక్‌ అమ్మేశాడు.త్వరలోనే సదరు సంస్థ వి మ్యాక్స్‌ను కూల్చేసి తమ నిర్మాణాను చేపట్టనుంది.

థియేటర్‌ను వినాయక్‌ ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే మంచి డిమాండ్‌ రావడంతో అమ్మేశాడట.సదరు సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించి థియేటర్‌ను కొనడానికి ముందుకు వచ్చింది.దాంతో వినాయక్‌ అధిక లాభం వస్తుందనే ఉద్దేశ్యంతో అమ్మేశాడు.

Advertisement

గతంలో జంట థియేటర్లు అయిన కమల్‌, రాజ్‌ కమల్‌లో ఒకదాన్ని వినాయక్‌ కొనుగోలు చేసి వి మ్యాక్స్‌గా మార్చాడు.

వి మ్యాక్స్‌ను ప్రారంభించాక ఈ థియేటర్‌కు మంచి పేరు వచ్చింది.అయితే తాజాగా మంచి రేటు వచ్చిన ఉద్దేశ్యంతో వినాయక్‌ ఈ థియేటర్‌ను విక్రయించాడు.లాభసాటి భేరం రావడంతో ఏం ఆలోచించకుండా వినాయక్‌ వి మ్యాక్స్‌ను అమ్మేశాడు.

కాగా ఈ నెలాకరున సదరు హైపర్‌ మార్కెట్‌ సంస్థ వి మ్యాక్స్‌ పడగొట్టి తమకు అనుకూలంగా నిర్మాణాలు ప్రారంభించనున్నారు.