'ఓటుకు నోటు ' ! చిక్కుల్లో పడ్డ రేవంత్

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Redd ) స్పీడ్ పెంచారు.

పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతుంది.

ఇక పూర్తిగా ఎన్నికల వ్యవహారాల్లోనే రేవంత్ బిజీగా ఉంటున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ ముందుకు వెళ్తున్నారు.

దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు,  బిజెపి( BJP ) పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూ,  దూకుడు ప్రదర్శిస్తున్నారు .అయితే కీలకమైన ఎన్నికల సమయంలో అనూహ్యంగా మళ్ళీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది.ఈ కేసులో రేవంత్ కు భాగస్వామ్యం ఉండడంతో,  ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం రేవంత్ కు ఇబ్బందికరంగా మారింది.

 బీఆర్ఎస్( BRS PARTY ) ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్ర పై అనేక విమర్శలు చేస్తూ వస్తోంది.2015లో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసు విచారణ సెప్టెంబర్ లో జరిగింది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడున మళ్లీ సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ కన్నా,  జస్టిస్ ఎన్విఎన్ భట్టి నేత్రత్వంలో ద్విసభ్య ధర్మాసనం ముందుకు రాబోతోంది .మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( YCP MLA Alla Ramakrishna Reddy ), తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన వేరు వేరు పిటిషన్ లు కూడా మరో ధర్మసనం ముందుకు విచారణకు రాబోతున్నాయి.  ఈ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu )ను టార్గెట్ చేస్తూ ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటిషన్ లో అనేక అంశాలను పేర్కొన్నారు.

Advertisement

ఈ కేసులో తనను నిందితుడిగా తనను తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు.అప్పట్లో టిడిపిలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ నిందితుడిగా పేర్కొంది.

 జ్యూడిషల్ రిమాండ్ లో భాగంగా కొంతకాలం జైలులోను ఉన్నారు.ఆ తర్వాత హైకోర్టుకు ఈ పిటిషన్ మారింది .విచారణ తర్వాత వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును 2021లో ఆశ్రయించారు.ఈ కేసు ఏసీబీ పరిధిలోనిది కాదని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

ట్రైల్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ అంశంలో విభేదించిన రేవంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో,  తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఏ చర్యలు వద్దని స్టే విధించింది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ద్వారానే చంద్రబాబు మొత్తం ఈ వ్యవహారం నడిపారని ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న ఆడియో రికార్డుల్లోనూ గొంతు కూడా ఆయనదేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు.ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ,  సూట్ కేసుల్లో డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఇప్పుడు టిక్కెట్ల కోసం కోట్ల రూపాయలు డబ్బులు దండుకుంటున్నారు అంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఈ వ్యవహారం రేవంత్ కు తలనొప్పిగా మారింది.

Advertisement

తాజా వార్తలు