విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.ఎస్.

కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అరకు వైపు నుంచి ఎస్.కోట వస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.అయితే చెక్ పోస్టును తప్పించుకొని ముందుకు వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు.

ఈ క్రమంలో వెహికల్ లో 110 ప్యాకెట్లలో సుమారు 520 కిలోల గంజాయిని పట్టుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువు సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు