DOGE నుంచి తప్పుకోవడంపై వివేక్ రామస్వామి స్పందన .. మస్క్‌‌పై షాకింగ్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ఎన్నికైన తక్షణం పలు కేబినెట్ పదవులకు, కీలక పోస్టులకు సమర్ధులైన వారిని నియమించారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్ధలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) అనే వ్యవస్ధను కొత్తగా నెలకొల్పారు ట్రంప్.

దీనికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామిలను సారథులుగా నియమించారు.అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనూహ్యంగా వివేక్ రామస్వామి తన బాధ్యతల నుంచి తప్పుకోవడం అమెరికన్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ముఖ్యంగా ఎలాన్ మస్క్‌తో విభేదాల వల్లే వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఈ నేపథ్యంలో వివేక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

తామిద్దరం ఒకే ఆలోచనతో ఉన్నానని.కాకపోతే తాను చట్టాలను నమ్మితే, మస్క్ టెక్నాలజీని విశ్వసిస్తారని రామస్వామి అన్నారు.

Advertisement
Vivek Ramaswamy Breaks Silence About Why His Quitting From Doge-DOGE నుం�

దేశాన్ని రక్షించడంపై మా మధ్య పరస్పరం చర్చలు జరిగాయని.ఇద్దరం ఒకే అంశంపై పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

Vivek Ramaswamy Breaks Silence About Why His Quitting From Doge

ఇకపోతే.ఒహియో గవర్నర్ రేసులో ( Ohio governors race )వివేక్ రామస్వామి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.2026 నవంబర్‌లో ఒహియో గవర్నర్ ఎన్నికలు జరగనున్నాయి.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడిన వారిలో వివేక్ రామస్వామి కూడా ఒకరు.గతేడాది జనవరిలో అయోవా కాకస్‌లలో నాల్గవ స్థానంలో నిలిచిన ఆయన రేసు నుంచి తప్పుకున్నారు.

అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి మద్ధతు లభించకపోవడంతో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని.డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్ధతని వివేక్ ప్రకటించారు.

Vivek Ramaswamy Breaks Silence About Why His Quitting From Doge

భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.తల్లి డాక్టర్.

ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.

Advertisement

ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్ల పైమాటే.అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజా వార్తలు