క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షిస్తున్న విటమిన్-బీ!

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలో ప్రాణంపోసుకున్న క‌రోనా వైర‌స్‌.ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద గండంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి చిన్నా.పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

Vitamin B Helps To Increase Immune System! Vitamin B, Immune System, Coronavirus

అయితే ఈ క‌రోనా భూతం నుంచి ర‌క్షించుకోవాలంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.విట‌మిన్ సీ, డీలు రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర‌చ‌డంలో కీల‌క ప్రాత పోషిస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే చాలా మంది సీ, డీ విట‌మిన్లు ఉన్న ఆహారం తీసుకుంటుంటే.మ‌రికొంద‌రు ఈ విటమిన్ల ట్యాబ్లెట్లు వేసుకుంటారు.

Advertisement

అయితే విట‌మిన్ బీ కూడా రోగనిరోధక శక్తి పెంపొందించి క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా చికిత్స‌లో రోగుల‌కు విట‌మిన్ సీ, డీలు మాత్ర‌మే అందించారు.

అయితే తాజాగా జ‌రిపిన‌ ఆధ్య‌య‌నంలో రోగ‌ల‌కు విట‌మిన్ బీ ఇవ్వ‌గా.మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని నిపుణులు అంటున్నారు.

కరోనాను నిర్వీర్యం చేయ‌గ‌ల‌ శక్తి విటమిన్ బీ కి ఉంద‌ని ఈ ఆధ్య‌య‌నంలో తేలింది.అలాగే విట‌మిన్ బీతో శ్వాసకోస పనితీరు మెరుగుప‌డుతుంద‌ని కూడా నిపుణులు గుర్తించారు.

అందుకే సీ, డీ విట‌మిన్ల‌తో పాటు విట‌మిన్ బీ ల‌భించే ఆహార ప‌దార్థాల‌ను కూడా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు