Vishwak sen: మళ్లీ నోరు జారిన విశ్వక్ సేన్.. ఇంత దూకుడు అవసరం అంటారా?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

యంగ్ హీరో సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువగా హైలైట్ అయ్యారు అని చెప్పవచ్చు.మరి ముఖ్యంగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సమయంలో ఫ్రాంక్ వీడియో ఒక ఎత్తు అయితే యాంకర్ నాగవల్లి, గెటవుట్ మై స్టూడియో అంటూ విశ్వక్ సేన్ ని అవమానించడం మరొక ఎత్తు అని చెప్పవచ్చు.

ఇలా సినిమాల ద్వారా కంటె ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా సోషల్ మీడియాలో నిలవడంతో పాటు భారీగా పాపులర్ అయ్యాడు విశ్వక్ సేన్.ఇదే విషయంపై పలువురు నెటిజన్స్ విశ్వక్సేన్ పై భారీగా ట్రోలింగ్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా విశ్వక్సేన్ మరొకసారి ఒక బూతు మాట మాట్లాడి ట్రోలింగ్స్ బారిన పడ్డాడు.తాజాగా ముఖచిత్రం సినిమా ట్రైలర్ లాంఛ్ లో భాగంగా విశ్వక్ సేన్ బూతు మాట మాట్లాడబోయి నాలుక కరచుకున్నారు.

Advertisement

తన స్నేహితుడు సందీప్ రాజ్.ముఖచిత్రం సినిమాలో క్యామియో రోల్ చేయమని అడిగితే.

సినిమా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా అని అన్నారు.అలా సినిమా చూసిన తర్వాత రోల్ ఏదైనా గానీ చేసేయాలి అని ఫిక్స్ అయ్యానని, అంతగా తనకు ఆ సినిమా కథ నచ్చిందని విశ్వక్ సేన్ అన్నారు./br>

అయితే ఎంత స్నేహం ఉన్నా కూడా మొహమాటానికి చేసేస్తా అని చెప్పే టైపు కాదని అన్నారు.సినిమా చూసి ఐ వాంట్ టూ ఫ* అనబోయి.వెంటనే సరి చేసుకుని.

సినిమా చూసి ఈ సినిమాలో భాగమవ్వాలని సీరియస్ గా తీసుకున్న నిర్ణయం అని విశ్వక్ సేన్ అన్నారు.విశ్వక్ సేన్ ఆ మాట అనబోయారని తెలిసి వెనుక ఉన్న హీరోయిన్లు నవ్వుకున్నారు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!

ఏ విషయంపై పలువురు నెటిజన్స్ అతనిపై మండిపడుతూ ఒకటి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు ఇలా పదేపదే ఆ పదం ను ఉపయోగించడం బాగోలేదు అని మండిపడుతున్నారు.

Advertisement