విశాఖలో నేవీ ఆఫీసర్ కుమార్తెపై లైంగిక దాడి..నగ్న ఫోటోలు, వీడియోలు తీసి ఆపై..!

ఇటీవలే చాలామంది కామాంధులు తమ కోరికలను తీర్చుకోవడం కోసం అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడుతూ, నగ్నంగా ఉండే ఫోటోలు, వీడియోలను తీసి బెదిరించి లొంగ తీసుకుంటున్నారు.

తాజాగా విశాఖపట్నంలోని నేవీ ఆఫీసర్ కుమార్తె పై జరిగిన లైంగిక దాడి వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.విశాఖపట్నం( Visakhapatnam )లోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బాపూజీ నగర్ లో నివాసం ఉంటున్న నేవీ ఆఫీసర్ కుమార్తె పదవ తరగతి చదువుతుంది.స్కూల్లో అటెండర్ గా పని చేస్తున్న సత్యారావు, నేవీ ఆఫీసర్ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అంతేకాకుండా ఆ బాలిక నగ్నంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలను చిత్రీకరించి భద్రపరుచుకున్నాడు.ఇక తరచూ ఆ ఫోటోలు, వీడియోలతో ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడమే కాకుండా.

Advertisement

ఈ విషయం తన స్నేహితులకు కూడా చెప్పడంతో, వారు కూడా ఆ బాలికను బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు.ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆ బాలికను బెదిరించడంతో ఆ బాలిక ఎవరికి చెప్పలేదు.

అంతేకాకుండా అటెండర్ సత్య రావు ఆ ఫోటోలు వీడియోలను బాలిక కుటుంబానికి పంపించి వేధించడం మొదలుపెట్టాడు.దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎయిర్పోర్ట్ పోలీసులు కేసును నమోదు చేసి ఈ కేసును దిశాకు బదిలీ చేశారు.

పోలీసులు( Police ) సత్యారావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ కేసులో మరో ముగ్గురికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్త బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

యూఎస్: ఆ కారణంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటుందట.. అందరూ షాక్..?
Advertisement

తాజా వార్తలు