మైదానంలో కోహ్లీ - కేఎల్ రాహుల్ మాటల యుద్ధం.. ఎందుకంటారు?

క్రికెట్ ఓ జెంటిల్‌మన్స్ గేమ్ అయినా.ఎమోషన్స్, పోటీ భావం మైదానంలో కొన్నిసార్లు పెరిగిపోతాయి.

చరిత్రలో ఎన్నో సందర్భాల్లో ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని బయటపెట్టిన దాఖలాలు ఉన్నాయి.ఇక మ్యాచ్ లలో హీట్ అఫ్ ది మొమెంట్‌లో మాటల యుద్ధాలు క్రికెట్ అభిమానులకు ఇవి కొత్తేం కాదు.

తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లోనూ అలాంటి ఘట్టమే మళ్లీ కనిపించింది.ఈసారి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ( Virat Kohli, KL Rahul )మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇదివరకు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals vs RCB at Chinnaswamy Stadium ) విజయానికి కేఎల్ రాహుల్ చేసిన "ఇది నా అడ్డా" అంటూ కాంతారా సెలబ్రేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.కోహ్లీ వంటి ఫైర్‌ బ్రాండ్ ఆటగాడిని కాస్త కదిలిస్తే చూస్తే.

Advertisement

ఎలా వదులడో తెలిసిన విషయమే.అతడు అవకాశమే ఎదురుచూసి, తాజాగా అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.కోహ్లీ తన బ్యాటింగ్‌తోనే కాదు, తన అగ్రెషన్‌తోనూ మ్యాచులో హీట్ పెంచేసాడు.

ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.ఆటపరంగానే కాకుండా, మైదానంలో నేరుగా ఒకరినొకరు ఉద్దేశించి మాట్లాడుకున్నారు.ఇద్దరూ చేతి సంకేతాలతో ఏదో తీవ్రమైన చర్చ చేసుకుంటూ కనిపించారు.

మైకుల్లో వారి మాటలు సరిగ్గా రికార్డ్ కాలేకపోయినా, సీన్ చూసినవారికి అది ఓ సీరియస్ డిస్కషన్ అనిపించింది.అయితే, ఇద్దరూ అంపైర్ నిర్ణయం పైనే తీవ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది.

నూతన సంవత్సరం ఎర్రటి కాగితంపై ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!

అయితే కోహ్లీ ఎక్కువసేపు వాదన చేయకుండా బ్యాటింగ్ మీద దృష్టి పెట్టి వెనక్కి వెళ్లిపోయాడు.అదే సమయంలో కేఎల్ రాహుల్ అసహనంగా కనిపించడం గమనించవచ్చు.

Advertisement

ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెత్తిన దుమారం రేపుతోంది.క్రికెట్ అభిమానులు ఇది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

ఒకపక్క ఆట పట్ల వారి ప్యాషన్‌ని మెచ్చుకుంటూనే, మరోపక్క మైదానంలో ఇలా అసహనానికి లోనయ్యారనే విషయాన్ని చర్చించుకుంటున్నారు.

తాజా వార్తలు