ఏందయ్యా ఇది.. గుడ్డుతో హల్వా తయారీని ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..

ఆహార ప్రయోగాల ప్రపంచంలో ఒక వింతైన వంటకం ఇటీవల వైరల్ వీడియోగా మారింది.ఈ వంటకంలో ఏం వాడారో ఊహించగలరా? గుడ్లు! అవును, మనకు తెలిసిన ప్రోటీన్ గుడ్లను( Egg ) ఇప్పుడు ఒక డెజర్ట్‌లో మెయిన్ ఇంగ్రెడియంట్ గా వాడేసారు.

ఆ డెజర్ట్‌ మారేదో కాదు.

మనం ఎంతో ఇష్టంగా తినే హల్వా.( Halwa ) దీనిని ఎగ్ హల్వా అంతరాట.

గుడ్డుతో హల్వా తయారీ అనేది చాలా కొత్త ఆలోచన.అందుకే దీని గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి దీనిని తయారీ విధానం చాలా సులభం.డెజర్ట్( Dessert ) చూడటానికి చాలా అందంగా ఉండటంతో పాటు రుచికరంగా కూడా ఉంటుంది.

Advertisement

ఈ ఎగ్ ప్రిపరేషన్ వీడియో ఓపెన్ చేస్తే ఒక మహిళ గిన్నెలో గుడ్లు పగులగొట్టి, వాటితో పాటు పిండి, చక్కెర కలిపి ఒక వింతైన పిండిని తయారు చేస్తుంది.ఆ తరువాత ఎలక్ట్రిక్ బీటర్‌తో మిశ్రమాన్ని బాగా కలుపుతుంది.ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఈ గుడ్డు-పిండి-చక్కెర మిశ్రమాన్ని పోస్తుంది.

ఉడికేటప్పుడు మిశ్రమం చిక్కబడుతుంది.చివరగా, క్రీమ్‌తో పాటు డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి, గుడ్డు హల్వా( Egg Halwa ) అనే అద్భుతమైన డెజర్ట్‌ను తయారు చేస్తుంది.

ఈ రెసిపీని ట్రై చేయాలనుకునే వారి కోసం పదార్థాలు కూడా తెలియజేసారు.అవి 6 గుడ్లు, 1 కప్పు చక్కెర, 1 కప్పు పాల పొడి, 1 కప్పు నెయ్యి లేదా వెన్న, 1 కప్పు క్రీమ్.గుడ్లు మనం రోజూ తినే ఆరోగ్యకరమైన ఆహారం కానీ గుడ్లతో హల్వా కూడా చేయవచ్చనే సంగతి చాలా మందికి తెలియదు.

ఈ రెసిపీ వీడియోకు 16 లక్షల వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వింతైన వంటకం చూసి ఆశ్చర్యపోయారు.ఇది కొందరికి వికారంగా అనిపించింది, మరికొందరు ఈ డెజర్ట్‌ను రుచి చూడాలని ఆసక్తి చూపించారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

కొంతమంది తమ అమ్మలు కూడా గుడ్డు హల్వా చేస్తుంటారని, అది చాలా రుచిగా ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు