వైరల్ వీడియో: పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ (Sankranti festival)అని అనగానే అందరికు ముందుగా గుర్తు వచ్చేది.పిండి వంటలు, బంధువుల సందడి, ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు.

ఇంకా మగవాళ్ళు, చిన్నపిల్లలకు పతంగుల జోరు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇక సంక్రాంతి పండగ పూర్తి అవ్వగానే అందరికీ ముఖ్యంగా గుర్తు వచ్చేది కోడిపందాల జోరు(Cockfighting).

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్రంలోని గోదావరి జిల్లాలలో కోళ్ల పందాల జోరు చాలా సరదాగా జరగడంతో పాటు విలువైన బహుమతులు కూడా గెలుచుకుంటూ ఉంటారు.ఇలా పందెం కోసం అని వెళ్లిన ఒక కోడి పుంజు(Chicken coop) చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇక మరికొందరు అయితే అదే పనిగా సంక్రాంతి కోసం వారి కోడిపుంజులకు ప్రత్యేకమైన ఆహారం అందజేయడంతో పాటు, పందెం కోసం తగిన శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు.అయితే, పందెం కోసం నెల రోజుల ముందే కోళ్లను కోడి పందాల కోసం సిద్ధం చేసేందుకు వాటికి బాదం పిస్తా లాంటివి తినిపిస్తూ పందెంకి సిద్ధంగా ఉండేందుకు తయారుచేస్తారు.

Advertisement
Viral Video: Where Did The Chicken Prepared For Racing End Up?, Hen, Viral Lates

అయితే, తాజాగా పందెం కోసం అని తీసుకొని వెళ్ళిన పుంజు పందానికి ముందే పారిపోయి తన యజమానికి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

Viral Video: Where Did The Chicken Prepared For Racing End Up, Hen, Viral Lates

దీంతో ఆ యజమాని కోడిపుంజు కోసం వెతకగా ఒక ఎండిపోయిన బావిలో దాక్కొని దర్శనమిచ్చింది.అయితే, కేవలం పుంజు మాత్రమే కాకుండా దానితో పాటు అక్కడ పెట్ట కూడా ఉంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

పందానికి పోయి సచ్చే దాని కంటే.ప్రేమించిన పెట్టతో పారిపోవడం బెటర్ అని అనుకుందేమో అని కామెంట్ చేయగా.

మరికొందరు ఎవరైనా కావాలనే ఆ కోడిపుంజు ఉండే పెట్టను బావిలోకి పడేశారా అని కామెంట్స్ చేస్తున్నారు.

విశ్వంభర మూవీ హిందీ హక్కులు అన్ని రూ.కోట్లా.. చిరంజీవి రేంజ్ ఏంటో తేలిపోయిందిగా!
Advertisement

తాజా వార్తలు