వైరల్ వీడియో: జీవితం మీద ఆశలేకపోవడం అంటే ఇదే... ప్రాణాలతో చెలగాటమాడుతున్న యువకుడు!

బేసిగ్గా మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఎంతో అలెర్ట్ గా ఉంటాం.

ఎందుకంటే, మన వలన ఏ తప్పు జరగకపోయినా, ఎదుటివారు చేసిన తప్పులకు మనం బలవ్వకూడదు కదా.

ఎవడు ఎలా డ్రైవ్ చేస్తాడో మనకు తెలియదు.కొంతమంది తాగి డ్రైవ్ చేస్తే, మరికొంతమంది ఏదో ధ్యాసలో వుంటూ డ్రైవ్ చేస్తారు.

తత్ఫలితంగా ఎవడో చేసిన తప్పుకి అమాయకులు బలవుతుంటారు.ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూనే కాబట్టి మీరు కారులో డ్రైవింగ్ చేస్తున్నా లేదా కాలినడకన నడుస్తున్నా ఎల్లప్పుడూ రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలి.

అయితే నేటితరం ప్రబుద్ధులు కావాలని రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తుంటారు.వీరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.

Advertisement

తాజాగా ఒక వ్యక్తి చేసిన పనికి అందరు షాక్‌ అవుతున్నారు.ప్రస్తుతం అతడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డుపై వేగంగా వెళ్లే వాహనాల మధ్యలో అతడు చేసిన పిచ్చిపనికి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగింతో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వాహనాలు వేగంగా వస్తుండటం మనం గమనించవచ్చు.

సరిగ్గా సమయంలో ఒక వ్యక్తి సాదాసీదాగా నడుచుకుంటూ వచ్చి, అకస్మాత్తుగా రోడ్డుపై పుష్ అప్స్‌ చేయడం మొదలు పెడతాడు.వాహనాలు రాగానే కిందకు వంగడం, అవ్వి వెళ్ళిపోగానే పైకి లేవడం చేస్తుంటాడు.ఇలా చేస్తుండగా అతడిపై నుంచి దాదాపు 5 నుంచి 6 వాహనాలు వెళుతాయి.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

అయితే అప్పటికి ఆ వ్యక్తి కి ఏమి కాకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది.ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసేవి.

Advertisement

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది.ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ఇప్పటివరకు ఈ వీడియోని 48 లక్షల మందికి పైగా చూశారు.సదరు వీడియోని తిలకించిన వారు అతగాడికి చివాట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు