ప్రపంచమే ఇపుడు మన అరచేతిలో వుంది.అదేనండి స్మార్ట్ ఫోన్ రూపంలో.
అందువలన ప్రపంచ వ్యాప్తంగా వున్న కళాకారుల్ని మనం ఇట్టే చూడగలుగుతున్నాం.
ఈ క్రమంలో ప్రతిభావంతులైన చిన్న పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతూనే ఉన్నాయి.
వీటిలో కొన్నింటిని చూసినప్పుడు, వీళ్ళు.పిల్లలా లేదంటే పిడుగులా అనే అనుమానం కలగక మానదు.
ఎందుకంటే కొన్ని పిల్లల వీడియోలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి మరి.ఈ కిందినున్న వీడియో చూస్తే మీరు దీని ఒప్పుకోకుండా ఉండలేరు మరి! తాజాగా ఓ బాలిక వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.ఆ బాలిక తన ప్రత్యేకమైన ప్రతిభతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
వీడియో చూసిన తర్వాత, ఈ అమ్మాయి ప్రతిభకు మీరు కూడా ఫిదా అయిపోవడం గ్యారంటీ.అమ్మాయి తన ముఖం మీద ముసుగుని మార్చే వేగానికి షాక్ తింటారు.
ఇన్స్టా లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయంటే మీకు నమ్మశక్యం కాదు.అయితే ఈ అమ్మాయి మన దేశానికి చెందిన అమ్మాయికాదు.
డ్రాగన్ కంట్రీకి చెందిన అమ్మాయి.ఆదేశ సంప్రదాయ దుస్తుల్లో మాస్క్ ధరించిన ఓ అమ్మాయి చుట్టూ కొందరు నిల్చున్నట్లు వీడియోలో మనం గమనించవచ్చు.
ఆ అమ్మాయి తన ముక్కును తాకమని ముందు వున్నవారిని అడుగుతుంది.వారు ఆ బాలిక ముక్కును తాకిన వెంటనే ముసుగు రంగు మారుతుంది.తర్వాత వెనువెంటనే ముసుగు అదృశ్యమై.
ఆ బాలిక ముఖం కనిపిస్తుంది.అయితే ఇదంతా కొన్ని క్షణాల్లో జరగడం నిజంగా చూపరుల్ని అబ్బుర పరుస్తోంది.
ఆ అమ్మాయి అద్భుత ప్రతిభను చూసి ఆ మహిళ పక్కనే నిలబడిన వ్యక్తి ఆశ్చర్యపోవడం మనం వీడియోలో గమనించవచ్చు.ఇక అమ్మాయి అద్భుతమైన ప్రతిభకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో ఇంతవరకు 60 లక్షల మందికి పైగా లైక్ చేయడం కొసమెరుపు.
రోజు రోజుకీ వీడియోని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy