మాయలేదు.. మంత్రంలేదు.. వేసిన తాళాన్ని ఇంత సులువుగా తీయవచ్చా?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో స్మార్ట్ ట్రిక్స్ ప్రజల ముందుకు వస్తున్నాయి.అవి కొన్నిసార్లు ఉపయోగకరంగా ఉంటే, ఇంకొన్ని ఆశ్చర్యపరచే విధంగా ఉంటాయి.

తాజాగా ఒక వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.ఈ వీడియోలో తాళం చెవి పోయినప్పుడు, ఎలాంటి పాత పద్ధతులు లేకుండా, తాళం ఎలా సులభంగా ఓపెన్ చేయచ్చో చూపించారు.

దీన్ని చూసినవారు ఆశ్చర్యానికి గురవుతూ.ఇది దొంగలు పాటించే టెక్నిక్ అని కూడా అంటున్నారు.

చాలా సందర్భాల్లో మనం ఎక్కడైనా బయటకు వెళ్లినప్పుడు తాళం చెవి(Key) పోగొట్టుకునే పరిస్థితిలో పడతాం.అప్పుడు ఇంటి తాళం తెరవడానికి సుత్తి, రంపం వంటి సాధనాలను ఉపయోగించాల్సి వస్తుంది.

Advertisement
How Thieves Unlock Padlocks In 30 Seconds Using Petro Trick No Tools Needed, Vir

దీంతో తాళం మాత్రమే కాకుండా ఇంటి గొళ్లెం కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో.

ఒక వ్యక్తి సిరంజిలో పెట్రోల్ (petrol) నింపుకొని, తాళం చుట్టూ అన్ని వైపులా కొన్ని చుక్కలు వేసాడు.ఆ తర్వాత అగ్గిపెట్టతో పుల్ల వెలిగించి తాళానికి పెట్టాడు.

దానితో తాళం కొద్ది సేపట్లో మండిపోయింది.పూర్తిగా ఆరిపోయిన తర్వాత, ఒక్కసారి తాళాన్ని కిందికి ఒక్కసారి నొక్కగానే తాళం ఊడి వచ్చేసింది.

ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

How Thieves Unlock Padlocks In 30 Seconds Using Petro Trick No Tools Needed, Vir
స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

వీడియోను విశ్లేషించిన కొందరు నిపుణులు చెబుతున్నదేమంటే.తాళంలో ఉండే లోపలి లేయర్ పెట్రోల్ వేడికి కరిగిపోతుందని., దాంతో తాళం లోపలున్న మెకానిజం వదిలిపోయి తాళం సులభంగా తెరవబడుతుందని అంటున్నారు.

Advertisement

ఇది శబ్దం రాకుండా తాళం ఓపెన్ చేయడానికి ఉపయోగపడే టెక్నిక్‌గా దొంగలు కూడా ఉపయోగించేవారని అంటున్నారు.ఈ వీడియో వైరల్ అవుతున్నప్పటికీ, దీన్ని అనుకరించడంలో జాగ్రత్త అవసరం.

పెట్రోల్‌తో తాళం మండించడం ప్రమాదకరమైంది.ఇది అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చు.

అందుకే ఈ వీడియోను చూడాలి కాని ప్రయత్నించకండి.తాళం చెవి పోయినప్పుడు పోలీస్ లేదా తాళం తయారు చేసే వారి సాయం తీసుకోవడం ఉత్తమం.

తాజా వార్తలు