వైరల్ వీడియో: పోలీస్ స్టేషన్లో డాన్స్ తో అదరగొట్టిన పోలీసులు..

సోషల్ మీడియా( Social media )లో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే, తాజాగా ఒక కానిస్టేబుల్, మహిళా పోలీసు అధికారిని కలిసి చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక కానిస్టేబుల్, మహిళా పోలీస్ ఇద్దరు కూడా ఎనర్జీ డాన్స్ తో బిజీగా ఉండగా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి చేరుకుంటాడు.అది గమనించిన మహిళా పోలీస్ ఆఫీసర్ అతన్ని ఆఫీసర్ చూస్తున్నాడని సైగ చేయక, కానీ కానిస్టేబుల్ మాత్రం అది ఏమి పట్టించుకోకుండా డాన్స్ లో మునిగిపోయాడు.

ఎట్టకేలకు ఆ ఆఫీసర్ ను చూసి కానిస్టేబుల్( Constable ) ఒక్కసారిగా కంగుతిన్న వెంటనే వారు ఇద్దరు డాన్స్ ఆపేసి ఆఫీసర్ కు సెల్యూట్ చేసి సారీ చెప్పబోయారు.అయితే, ఈ క్రమంలో ఆ ఆఫీసర్ కూడా వాళ్లతో పాటు కలిసి డాన్స్ చేసేసాడు.వాస్తవానికి వారి ఇద్దరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడేమో అని కానిస్టేబుల్ తో పాటు ఆ మహిళ పోలీస్ అధికారి కూడా ఒక్క సారిగా భయపడిపోయింది.

ఇలా ముగ్గురు కలిసి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఇది రాజ్యాంగంలోనే ఉందని ఒకరు రాయగ.మరికొందరు ఎలాంటి ఒత్తిడి లేకుండా పోలీసులు సంతోషంగా డాన్సులు చేయడం నేను చూడడం మొదటిసారి అంటూ కామెంట్ చేశాడు.

Advertisement

ఇక ఇదే క్రమంలో మరొక వ్యక్తి వీరికి ఐదువేల రూపాయలు చలానా విధించాలి అంటూ కామెంట్ చేశాడు.

రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి..
Advertisement

తాజా వార్తలు