వైరల్ వీడియో: తన పెళ్లిలో డాన్స్ తో రెచ్చిపోయిన పెళ్ళికొడుకు..

ప్రస్తుత రోజుల్లో చాలామంది వారి ఇంట్లో జరగబోయే పెళ్లిళ్లకు సంబంధించి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

పెళ్లి నిశ్చయం జరిగినప్పుడు నుంచి ఆ తర్వాత జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ప్లాన్ చేసుకుంటున్నారు.

పెళ్లి కార్డు సెలక్షన్( Wedding card selection ) నుండి బంధువులు తిరిగి వెళ్ళే సమయంలో రిటర్న్ గిఫ్ట్ వరకు ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురులకు సంబంధించిన డాన్స్ వీడియోలు( Dance videos ) సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్ గా మారిపోయింది.

తాజాగా మరో పెళ్లి వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మారింది.

ఈ వైరల్ గా మారిన వీడియోలో ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులను రోడ్డుపై ఊరేగిస్తూ తీసుకెళ్తుంటారు.అందుకోసం వధూవరులకు ఇద్దరికీ ఓ రథం లాంటి వాహనం ఏర్పాటు చేసి దానిపై ఊరేగిస్తుంటారు.వధూవరులు ఏర్పాటు చేసిన వాహనంపై ఉన్న సోఫాలో కూర్చొని ఊరేగింపులో వెళుతూ ఉంటారు.

Advertisement

ఇలా వెళ్తున్న సమయంలో ఊరేగింపు మధ్యలో వరుడి స్నేహితులు డప్పు వాయిదానికి తీన్మార్ స్టెప్స్ వేస్తుంటారు.అయితే ఆ సమయంలో స్నేహితులు చేసిన తీర్మా డాన్స్( Tirma dance ) చూసి వరుడికి కూడా డాన్స్ చేయాలని అనుకున్నాడు.

దాంతో వెంటనే తను అనుకున్నది తరువాయి ఎవరేమనుకున్నా పర్లేదని డాన్స్ వేసి తీరాల్సిందే అనుకొని తన మెడలోని దండం తీసి చేతిలో ఉన్న పూల గుచ్చాన్ని పక్కన పెళ్ళికూతురికి ఇచ్చి బండి మీదనుంచి దూకేసి పరుగున వెళ్లి స్నేహితుడితో కలిసి డాన్స్ చేయడం మొదలుపెడతాడు.పెళ్ళికొడుకు డాన్స్ చూసి బంధువులందరూ చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేస్తారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్ వీడియో : వీలైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను.. ఆనంద్ మహీంద్రా..
Advertisement

తాజా వార్తలు