వైరల్ వీడియో: మాస్ బీట్ కు అదిరిపోయే స్టెప్పులేసిన దినేష్ కార్తీక్ అండ్ టీం...!

భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సారథ్యంలో తమిళనాడు జట్టు.దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిచారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని మొదటగా తమిళనాడు ఆడి 2006-07లో టైటిల్ గెలిచారు.మళ్లీ ఇప్పుడు అంటే 15ఏండ్ల తర్వాత ఆ టోర్నీ విజేతగా నిలిచింది.

ఆదివారం జరిగిన ఫైనల్లో బరోడాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించినది.మళ్ళీ రెండోసారి కూడా టైటిల్​ను గెలుచుకున్నారు.

సీనియర్ ప్లేయర్లు లేకున్నా గాని కేవలం కుర్రాళ్లతోనే దినేశ్ కార్తీక్ తమిళ జట్టును ముందుకు నడిపించి వాళ్ళని విజేతలుగా నిలబెట్టాడు.అయితే టైటిల్ గెలుచుకున్న సందర్భంలో దినేశ్ కార్తీక్ అండ్ వాళ్ళ టీమ్ సంబరాల్లో మునిగిపోయి ఆనందంలో మునిగిపోయింది .

Advertisement

ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన విజయ్, విజయ్ సేతుపతి సినిమా మాస్టర్ లోని ఒక మాస్ బీట్​కు కార్తీక్​తో పాటు జట్టు సభ్యులు డ్యాన్స్ చేసి ఇరగదీసారు.తమిళంలో ఉన్న వాథీ కమింగ అనే మ్యూజిక్​ బీట్ కి సరిపడా చిందులు వేసి ఆడి పాడార .ముందుగా కార్తీక్ స్టైలిష్ మూవ్​తో డ్యాన్స్ స్టెప్ వేసారు అతడిని డాన్స్ మాస్టర్​గా భావించి కార్తీక్ ను అనుసరిస్తూ మిగతావాళ్ళు కూడా స్టెప్పులేశారు.ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్​ చేస్తున్నారు నెటిజన్లు.

ఇప్పటికే అనిరుధ్ డైరెక్షన్ చేసి పాడిన ఈ పాట యూట్యూబ్​లో ఒక ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రెండుసార్లూ కూడా కార్తీక్ సారథ్యంలోనే ఆ జట్టుకు టైటిల్ దక్కడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇప్పుడు ఈ జట్టుని అందరు ప్రశంసిస్తున్నారు.!! అలాగే ఇప్పుడు ఇ డాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.!.

న్యూస్ రౌండర్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు