వైరల్: ఓనర్ మేత వేయలేదా? ఆవు ఏకంగా ఇంటిపైకే ఎక్కేసింది?

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ప్రపంచ నలుమూలలా జరుగుతున్న అనేకానేక విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.

వాటికి కారణం ఈ స్మార్ట్ ఫోన్స్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఇపుడు చిన్నా, తేడా అని పెద్దగా తేడా లేకుండా అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ఇమిడిపోయింది.ఇంకేముంది.

దానిని పలు రకాల సోషల్ మీడియాలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి.నేడు బాగా వీడియో కంటెంట్ కి అలవాటు పడిన మనిషి సోషల్ మీడియాలకు బాగా బానిస అయిపోతున్నాడు.

సగటు మనిషి ఇండియాలో సుమారు ఇద్దరు గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నాడని ఓ సర్వే.

Advertisement

అదంతా పక్కనబెడితే ఇక్కడ అనునిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.అవును, సదరు వీడియోలో వైరల్ అవుతున్న ఒక ఆవు.

మరి దానికి ఆ ఇంటి యజమాని మేత వేయలేదా ఏమిటోగాని.అది వారి ఇంటి పైకప్పు పైకి కూర్చుంది.

అయితే అది అక్కడికి ఎలా చేరిందో అన్నది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్ధం కాలేదుగాని వీడియో మాత్రం నెటిజన్లను తెగ కితకితలు పెట్టిస్తోంది.ఈ వీడియో క్లిప్‌ చూసిన నెటిజన్లు మాత్రం రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

బేసిగ్గా మేకలు, కుక్కలు, పిల్లులు వంటి జంతువులు చెట్లు, కొండ గుట్టలు ఎక్కుతుంటాయి గాని, ఆవు ఇలా ఇల్లు ఎక్కడం మొదటిసారి చూస్తున్నాం అని ఒకరు కామెంట్ చేస్తే.అది అక్కడకు ఎలా ఎక్కింది? ఆ తర్వాత ఏమైంది? ఆ ఆవు కిందకు దిగిందా? ఎలా దిగింది? అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక కొంతమంది మాత్రం జంతువుల పట్ల వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

కొందరైతే దానిని కావాలనే వారు ఎక్కించి వుంటారు సరదాగా.అని అంటున్నారు.

Advertisement

మరెందుకాలస్యం మీరు కూడా చూసి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి ఇక.

తాజా వార్తలు