వైరల్ వీడియో: బెయిల్స్ వాటంతట అవే ఎలా పడిపోయైయబ్బా..?!

క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ క్రికెట్ ఆటను తెగ ఇష్టపడతారు.

చాలా మంది సినిమాల కంటే క్రికెట్ ను ఎక్కువగా అభిమానించేవారు ఉన్నారు.అందుకే క్రికెట్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇదిలా ఉండగా క్రికెట్ లో కూడా కొన్ని సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి.డిఫరెంట్ గా క్యాచ్ లు పట్టడం, మంచి ఫీల్డింగ్ చేయడం, అద్బుతంగా రన్ అవుట్ చేయడం వంటి సంఘటనలు చాలానే చోటుచేసుకుంటూ ఉంటాయి.

అయితే తాజాగా ఇంకో రకం ఘటన జరిగింది.క్రికెట్ చరిత్రలోనే ఇదొక వింతైన ఘటనగా పేర్కొనవచ్చు.

Advertisement
Viral Video Bails Falls Automatically In T 20 Match With Zimbabwe And Bangladesh

ఓ బ్యాట్స్ మెన్ ఆశ్చర్యకరంగా అవుట్ అయ్యాడు.ఏ బౌలరో లేకుంటే ఫీల్డరో, వికెట్ కీపరో ఆయన్ను అవుట్ చేయలేదు.

వికెట్లు వాటంతట అవే పడిపోయాయి.బంగ్లాదేశ్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జరుగుతోంది.

ఇదొక టీ20 మ్యాచ్‌ కాబట్టి ఇందులో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇంతలో వికెట్లు వాటంతట అవే పడటంతో దెయ్యమే వికెట్ తీసింద‌ని చాలా మంది అంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు విచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 18వ ఓవ‌ర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video Bails Falls Automatically In T 20 Match With Zimbabwe And Bangladesh
Advertisement

మ‌హ‌మ్మ‌ద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు ఆయన వెనకాలే ఉండే వికెట్ల మీద బెయిల్స్ పడిపోయాయి.వాటంతట అవే పడిపోయాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వికెట్లపై ఉండే బెయిల్స్ ఎందుకు ప‌డిపోయాయనే విషయం ఎవ్వరికీ అర్తం కాకపోవడంతో కొంత సమయానికి గాలి వ‌లనే బెయిల్స్ ప‌డిపోయి ఉండొచ్చని అనుకున్నారు.అయితే నెటిజన్లు మాత్రం ఆ వికెట్లను తీసింది దెయ్యమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

తాజా వార్తలు