వైరల్: మెట్రోలో రెచ్చిపోయిన ముగ్గురు యువకులు!

ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్స్ మరియు స్టేషన్లు వైరల్ వీడియోలకు అడ్డాగా మారాయి.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనేక రకాల వీడియోలు ఇక్కడినుండి సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్న విషయం మనం గమనించవచ్చు.

ఇక నేటి యువత ప్రతిఒక్కరి చేతిలో ఫోన్ ఉండడంతో వారు పాపులర్ కావడానికి దేనికైనా సిద్ధపడుతున్నారని ఆ వీడియోలు చూస్తేనే మనకి అర్ధం అయిపోతుంది.ఇక వారు తమ వీడియో వైరల్ కావడం కోసం, లైక్స్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు.

ఈ క్రమంలో వారు చుట్టూ వున్న జనాల్ని కూడా పట్టించుకోవడం కొసమెరుపు.పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.ఇదేంటి అని ఎవరన్నా అడిగితే… ఇది సోషల్ మీడియా ప్రమోషన్ అంటూ అదేదో గొప్ప ఘనకార్యం అయినట్టు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా మెట్రోకు( metro ) సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కొందరు మెట్రోలో స్నానం చేస్తుండగా, మరికొందరు మెట్రోలో అసభ్యకర పనులు చేస్తూ కనిపించారు.

Advertisement

ఇప్పుడు తాజాగా లండన్‌లోని( London ) మెట్రోలో భారతదేశానికి చెందిన కొంతమంది పంజాబీ పాటకు డ్యాన్స్( Punjabi song ) వేయగా ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.వైరల్ అవుతున్నవీడియోలో.

మెట్రో రైలు కోచ్ మొత్తం ఖాళీగా ఉండడం మనం గమనించవచ్చు.అమర్ సింగ్ చమ్కిలా, అమర్‌జోత్‌ల కంకర్డ్ గల్ సన్ మఖ్నా పాటకు ఈ ఇండియన్స్‌ డ్యాన్స్‌తో ఇరగదీశారు.

ఈలింగ్ బ్రాడ్ వే స్టేషన్ సమీపంలోని లండన్ ట్యూబ్‌లో పంజాబీలు చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట
Advertisement

తాజా వార్తలు