వైరల్: తండ్రి ప్రేమకు నిదర్శనం ఇదే... ఇలాంటి వీడియో మీరు చూసుండరు!

సోషల్ మీడియా బాగా పెరగడంతో అనేక ఆసక్తికరమైన వీడియోలు బయటకి వస్తున్నాయి.స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని శాసిస్తున్నవేళ, తల్లిదండ్రులు అనేవారు వాళ్ళ పిల్లలతో ఆడటమే మర్చిపోయారు.

ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు పిల్లలకు ఇక్కడ స్కూళ్లలోనే సమయం గడిచిపోతోంది.ఇక ఇంటికి వచ్చిన పిల్లలనైనా తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదు.

పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు.దానివలన ఆ ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది.

పిల్లలకి కూడా స్మార్ట్ ఫోన్ చిన్న వయసులోనే అలవాటై పెను మార్పులకు దారితీస్తోంది.ఇలాంటి సందర్భంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది.

Advertisement

పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇతర వీడియోల కంటే ఇపుడు వేగంగా వైరల్ అవుతున్నాయి.ఇందులో పిల్లల అందమైన చర్యలు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటాయి.

అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అమాయకత్వంతో నిండిన పిల్లలు ఆనందం, వారి సానుకూల దృక్ఫథం చూపరులకు శక్తిని నింపుతాయి.

అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది.

ఈ వీడియోలో తండ్రి తన కొడుకుతో సరదాగా కుస్తీ పడుతున్న విషయం మనం గమనించవచ్చు.తన కొడుకుతో సరదాగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌ చేస్తున్నది వీడియోలో చూడవచ్చు.పిల్లవాడు రాండీ ఓర్టన్‌గా మారాడు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

తండ్రి బిగ్ షోగా మారి సరదాగా పోట్లాడుతున్నాడు.ఇంతలో పిల్లవాడు మొదట తన తండ్రిని రాండీ ఓర్టన్‌తో కొట్టాడు.

Advertisement

వెంటనే తండ్రి తన కొడుకుని సంతోషపెట్టడానికి కిందకు పడిపోయాడు.ఆపై పిల్లవాడు తన తండ్రిని పిన్-డౌన్ చేస్తాడు.

చివరగా మ్యాచ్ గెలిచాడు.ఈ వీడియోని చూసి నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.

వీరిని చూసైనా నేర్చుకుందాం.పిల్లలకు సమయం కేటాయించండి.

అంటూ ఎంతోమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.