వైరల్: ఇది మామ్మూలు ఛేజింగ్ కాదు.. సినిమాని మించిపోయిందిగా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియో కంటెంట్ జనాలకి అందుబాటులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే ప్రపంచంలోని ఏ మూలన ఉన్న సంగతి అయినా మనకి ఇట్టే తెలిసిపోతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛేజింగ్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక విషయంలోకి వెళితే.

ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద కాలికి గాయంతో తన ఊరికి వెళ్లాలని వెయిట్ చేస్తున్నాడు.ఈ క్రమంలో అప్పుడే అక్కడ పార్క్ చేసిన ఓ అంబులెన్స్( ambulance ) వేసుకుని చెక్కేసాడు.

అయితే అందరూ అనుకున్నట్టుగా అతను ఇంటికి చేరుకోలేదు.కాగా అంబులెన్స్‌తో పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్ లో చేజ్ చేయాల్సి వచ్చింది.

Advertisement
Viral This Is Not An Ordinary Chase, It Is More Than A Movie, Thief Stealing, 10

కట్ చేస్తే, ఈ క్రమంలో అంబులెన్స్‌తో కల్వర్టుకు ( culvert )ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు.

Viral This Is Not An Ordinary Chase, It Is More Than A Movie, Thief Stealing, 10

విషయం ఏమంటే.హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని( 108 vehicles in Hayatnagar ) ఓ దొంగ ఎత్తుకెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.అంబులెన్స్‌తో అతగాడు విజయవాడ పరారయ్యేందుకు యత్నించాడు.

ఈ నేపథ్యంలో చిట్యాల దగ్గర బారికేడ్లను ఢీకొట్టడంతో అసలు హంగామా మొదలైంది.విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు వాహనాలను అడ్డుగా పెట్టారు.

కానీ ఆ దొంగ ఆగకుండా టోల్‌ప్లాజా దగ్గర వాహనాలను ఢీకొట్టి మరీ పరారైయ్యాడు.మరోవైపు పోలీసులు కూడా తగ్గేదేలే అన్నట్లు టేకుమట్ల మూసీ బ్రిడ్జి దగ్గర మళ్లీ వాహనాలు అడ్డుపెట్టి.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

మొత్తానికి పట్టుకున్నారు ఆ దుండగుడిని.

Viral This Is Not An Ordinary Chase, It Is More Than A Movie, Thief Stealing, 10
Advertisement

మొత్తం సినీ ఫక్కీలో ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పోలీసులకు గతంలోనూ ఆ దొంగ అంబులెన్స్‌లను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.దాంతో వాడు దొంగ కాదు.

గజ దొంగ అని విషయం తెలుసుకున్నారు.ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.

ఆ అంబులెన్సుని కొట్టేయడానికి పేషేంట్ అవతారం ఎత్తడం! కాగా ఆ వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స చేయించుకున్నాడు.

అయితే అతను ఖమ్మంకు వెళ్లాలనుకున్నాడు.ఇందుకోసం ఏకంగా అంబులెన్స్‌నే ఎత్తుకెళ్లాడు.

తాజా వార్తలు