సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగాక ఆసక్తి కరమైన విషయాలు వైరల్ అవుతూ వస్తున్నాయి.ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే.
ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసుల( Traffic Police ) ఉదార స్వభావానికి సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ఈ క్రమంలోనే ఒక వీడియో వైరల్ అవుతూ నెటిజన్ల మెప్పుని పొందడం మనం గమనించవచ్చు.
ట్రాఫిక్ పోలీసులు నిత్యం శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా వుంటారనే విషయం అందరికీ తెలిసినదే.ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి రెక్కలు కట్టుకుని వాలిపోతారు.
ఓ రకంగా చెప్పాలంటే వారు చాలా కఠినమైన డ్యూటీ చేస్తూ వుంటారు.
అయినా కూడా కొంతమంది ఏమాత్రం విసుగు చెందక వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే కష్టాల్లో వున్న ప్రాణులకు కూడా సాయం చేస్తూ వుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులో ఉన్న మంచి మనసు బయటపడింది.ఇక ప్రాణాలు పోతాయేమోనని అంతా అనుకుంటున్న సమయంలో ట్రాఫిక్ పోలీసు చేసిన సాహసం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో( Jaipur ) ఒక రహదారికి పైన పదులకొద్దీ కరెంట్ తీగలు( Current wires ) ఉన్నాయి.ఓ పావురం అటుగా ఎగురుతూ వెళ్లడం వలన కాలికి కొన్ని తీగలు చిక్కుకుని గిలగిలా కొట్టుకోసాగింది.
దాని కష్టాన్ని గుర్తించిన ఓ ట్రాఫిక్ పోలీసు అక్కడికి వచ్చి, ట్రాఫిక్ ని క్లియర్ చేసి దానిని కాపాడతాడు.ఈ సంఘటన మొత్తాన్ని అక్కడ వున్నవారు వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.సదరు వీడియోని ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ అకౌంట్ సుప్రియ సాహు ఐఏయస్ ద్వారా షేర్ చేశారు.
ఈ వీడియో చూసిన పలువురు పోలీసాఫీసర్ ను ప్రశంసిస్తున్నారు.ఇలాంటి మంచి పోలీసులు ఉండబట్టే ప్రజలు, మూగజీవులు కాస్తయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy