Lions : వైరల్: ఎదురుగా సింహాలున్నా భయపడకుండా నిలబడిన వ్యక్తి... ఏం చేశాడంటే?

మనుషులు దాదాపుగా ఇపుడు సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం కాపురం చేస్తున్నారు.

దాంతో ఆటోమేటిక్ గానే సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా మందిమీద ఎక్కువగా వుంది.

ఈ క్రమంలో నిత్యం అనేకరకాల వీడియో కంటెంట్ అనేది ఇక్కడ హల్ చల్ చేస్తూ ఉంటుంది.అయితే అందులో ఏ కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండటం మనం చూస్తూ వున్నాం.

ముఖ్యంగా వన్యప్రాణులకు సంబందించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం గమనిస్తూ వున్నాం.బేసిగ్గా క్రూరమృగాలు అయినటువంటి పులి, సింహం వంటివాటిని వీడియోలో చూస్తేనే భయం కలుగుతుంది.

అలాంటిది లైవ్ లో చేస్తే ఎలా ఉంటుంది.ఒళ్ళు జలదరిస్తుంది కదూ.

Advertisement

అయితే ఇక్కడ వీడియోలో గమనిస్తే అందులో ఒక వ్యక్తి సింహాలు తనకి ఎదురుగా ఉన్నప్పటికీ వాటిని చూసి ఇసుమంతైనా భయపడలేదు.పైగా వాటికి ఫోటోలు, వీడియోలు తీస్తూ హాయిగా ఎంజాయ్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.అందులో ఒకటి కాదు రెండు కాదు, ఓ మూడు నాలుగు క్రూరమైన సింహాలు కనిపిస్తున్నాయి.

కెమెరా ప్యాన్ చేయగానే, కొంత దూరంలో మరో రెండు సింహరాశులు పొలంలో విశ్రాంతి తీసుకోవడం మనం గమనించవచ్చు.

కాగా ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు సైతం విస్మయానికి గురవుతున్నారు.అలాగే స్థానికంగా వున్న ప్రజలు కూడా ఔరా అని ముక్కున వేలేసుకున్నారట.ఇక ఈ వీడియోను IFS అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

కేవలం 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో అందరి మనసులను దోచేస్తోంది.ఇప్పటి వరకు దీనిని 2 లక్షలు కంటే ఎక్కువ మంది వీక్షించగా 5000 మందికి పైగా లైక్ చేయడం విశేషం.

Advertisement

ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.ఏమిరా వాడి గుండె ధైర్యం అని తెగ మెచ్చుకుంటున్నారు.

తాజా వార్తలు