వైరల్: నైటీలు ధరించిన ఆడవారికి రూ.2వేలు జరిమానా.. ఎక్కడంటే?

వినడానికి విడ్డూరంగా వున్నా మీరు ఇక్కడ చదివింది అక్షరాలా నిజమే.

అయితే ప్రస్తుతం సమాజంలో మహిళలు, యువతులు ఎక్కువగా ధరించే దుస్తులలో నైటీలు( Nighties ) ప్రధాన పాత్రను పోషిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు.నైటీలు అనేవి వారికి చాలా సౌకర్యవంతంగా వుంటాయి కాబట్టి.

బయట తిరిగేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకున్న, ఇంటికొచ్చేసరికి దాదాపుగా వారు నైటీలనే ఎక్కువగా ధరిస్తారు.కారణం అవి సౌకర్యంగా వుండడమే.

ఈ క్రమంలోనే నైటీలు వాడకం బాగా పెరిగింది.పల్లెలు, పట్టణాలు, అనే తేడా లేకుండా మహిళలు, యువతులు నైటీలు(రాత్రి పూట వేసుకునే సింగిల్ డ్రెస్) వేసుకోవడం సర్వసాదారణమైపోయింది.

Advertisement

అయితే దేశంలో ఎక్కడైనా అవి ధరించడం ఓకే కాని ఆ ఊరిలో ఆడవాళ్లు, యువతులు పగటి సమయంలో నైటీలు వేసుకుంటే మాత్రం గ్రామ పెద్దలు జరిమానా( Fine ) విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.నిజంగా అలా జరుగుతోందని తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ గ్రామనికి వెళ్లి విచారిస్తే నిజమేనని తేలింది మరి.దానికి వారు చెబుతున్న కారణం ఏమిటంటే, తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు ముక్తకంఠంతో చెప్పారు.దాంతో అధికారులు వారి నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోయారు కూడా.

అవును, పశ్చిమగోదావరి జిల్లాలోని తోకలపల్లి గ్రామంలో( Tokalapalli Village ) మహిళలు, యువతులు పగలు నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు గట్టిగా నిషేధించారు.ఒకవేళ కాదు కుదరదని ఎవరైనా నైటీలు వేసుకుంటే 2000 రూపాయల జరిమానా కట్టాలని తీర్మానించారు.అదేవిధంగా పగలు నైటీలు కట్టుకున్న వారిని చూసి చెప్పిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తామని కూడా అక్కడ ప్రకటించడం కొసమెరుపు.

గ్రామాల్లో ఇలాంటి జరిమానాలు, గ్రామ పెద్దల తీర్మానాలు ఆనేక రకాలుగా ఉంటాయి.కాని నైటీలు వేసుకుంటే జరిమానా విధిస్తారనే వార్త ఇపుడు వైరల్ అయింది.ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?.

షాలిని మణికట్టు కోసిన హీరో అజిత్.. చివరికి పెళ్లి పీటలు ఎక్కారు
Advertisement

తాజా వార్తలు