వైరల్: టపాసులతో పరాచికాలా? తిక్క కుదిరిందా?

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.అయితే అందులో కొన్ని మాత్రమే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.

కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే, కొన్ని వీడియోలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి.మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటే, కొన్ని చాలా విచిత్రంగా అనిపిస్తాయి.

ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలు పెడతారు.

టపాసులు కాల్చడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ముఖ్యంగా పండగల సందర్భాలలో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు.అయితే దీపావళి వంటి పర్వదినాల్లో కూడా ప్రభుత్వాలు పరిమితిగా మాత్రమే బాణాసంచా కాల్చుకోవడానికి షరతులు విధిస్తున్నాయి.

Advertisement
Viral Games With Crakers Is It Fixed , Crackers, Viral Latest, News Viral, Socia

అలాంటిది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే ఓ యువకుడు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన తీరుకి కోపం రాక తప్పదు.అయితే తరువాత జరిగిన తీరుకి మాత్రం తీవ్రస్థాయిలో నవ్వు కలుగుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.పటాకులు కాల్చేందుకు ట్రై చేస్తుంటాడు.

అయితే.అయితే అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఉండేలా పటాకులు కాలుస్తాడు.

టపాసును వెలిగించి దాని మీద ఓ డబ్బా బోర్లిస్తాడు.

Viral Games With Crakers Is It Fixed , Crackers, Viral Latest, News Viral, Socia
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

అయితే అంతకు ముందే క్రాకర్ కు నిప్పు అంటించి పెడతాడు.ఆ తరువాత ఆ టపాకు పేలడంతో దానిపై కప్పిన డబ్బా.అమాంతం గాల్లోకి అల్లంత దూరం ఎగురుతుంది.

Advertisement

కట్ చేస్తే అలా ఎగిరే డబ్బా ఒక్కసారిగా ఆ టపాసు అంటించిన వ్యక్తి తలపై పడటం కొసమెరుపు.ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడటం గమనించవచ్చు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.కాగా ఇప్పటివరకు ఈ వీడియో 94 వేలకు పైగా వ్యూస్ పొందగా, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

అంతే కాకుండా నెటిజన్లు అయితే తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు