వైరల్: డ్యాన్స్‌ ఇలా కూడా చేయొచ్చా గురూ? ఆ పాటను ఇంతకంటే ఎవరూ కూనీ చేయలేరు!

నెట్టింట్లో అనునిత్యం రకరకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.అయితే వీటిలో చాలా తక్కువ వీడియోలు వైరలవుతుంటాయి.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది.ముఖ్యంగా పెళ్లి వేడుకలో జరిగే కొన్ని విషయాలు అడపాదడపా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ప్రత్యక్షమౌతూ ఉంటాయి.

నేడు వివాహాలు ఎంత కన్నుల పండగగా జరుపుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.బరాత్‌లో డ్యాన్సులు చేయడం నుండి మండపం వద్ద చిందులు తొక్కే వరకు ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు నవ వధూవరులు.

ఈ నేపథ్యంలోనే ఓ డాన్స్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.మిథున్ చక్రవర్తి చిత్రం డిస్కో డాన్సర్‌లోని జిమ్ జిమ్మీ పాటకు ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేస్తోంది.

Advertisement

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి జిమ్మీ జిమ్మీ పాటకు తనదైన రీతిలో డ్యాన్స్ చేయడం గమనించవచ్చు.కాగా ప్రజలు జిమ్మీ జిమ్మీ పాటలో అతని డ్యాన్స్‌ని మళ్లీ మళ్లీ చూసేందుకు చాలా ఇష్టపడుతున్నారు.

రోహిత్ విశ్వాస్ అనే వినియోగదారుడు సదరు డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఓ వివాహం సందర్భంగా మిథున్ చక్రవర్తి సినిమా డిస్కో డాన్సర్ పాటకు ఓ వ్యక్తి చేసిన సదరు డ్యాన్స్ ని చూసి నెటిజన్లు రకాలుగా స్పందిస్తున్నారు.అక్కడ ఉన్న జనం కూడా ఆ డ్యాన్స్‌ని ఎంజాయ్ చేస్తూ వీడియోలు కనిపించడం గమనించవచ్చు.

అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు వైరల్ కావడం విశేషం.కాగా కొంతమంది నెటిజన్లు సదరు సినిమా పాటను ఇంతకంటే ఎవరు కూనీ చేయలేరని చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?
Advertisement