వైరల్: ఒక ఆటోను ఇలా కూడా తయారుచేయొచ్చా? అతని క్రియేటివిటీకి ఇంజినీర్లు సైతం ఫిదా!

ఆలోచన ఉండాలేగాని ఒక సాధారణమైన విషయాన్ని కూడా అసాధారణమైనదిగా తీర్చిదిద్దవచ్చు.

అవును, మన దేశంలో ప్రజా రవాణా సౌకర్యాలలో ఆటోరిక్షాల పాత్ర కూడా చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో చాలామంది ఆటో డ్రైవర్లు తమ త్రీ వీలర్‌ను తమకి నచ్చినట్టు అలంకరించుకుంటారు.అంతేకాకుండా అందులో మరిన్ని ఫీచర్లు ఉండేలా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు.

ఈ నేపథ్యంలోనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనం లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.ఓ రకంగా చెప్పాలంటే తన ఆటోని ఒక పెళ్లికూతురు మాదిరి తయారు చేసిన తీరు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Viral Can An Auto Be Made Like This Engineers Are Also Jealous Of His Creativit

అవును, ఇపుడు దాన్ని చూడగానే ఆటోరిక్షా అనీ ఫీలింగ్ కలగదు.ఒక విలాసవంతమైన పెళ్లి వాహనంలాగా కనబడుతోంది.ఆటోకు రూఫ్‌లెస్ టాప్‌తో పాటు లోపల ఖరీదైన సీట్లను మనం చూడవచ్చు.

Advertisement
Viral Can An Auto Be Made Like This? Engineers Are Also Jealous Of His Creativit

వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ లగ్జరీ ఆటోకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు.‘విజయ్ మాల్యా తక్కువ ధరలో 3 వీలర్ ట్యాక్సీని డిజైన్ చేయాల్సి వస్తే’ అంటూ దీనికి క్యాప్షన్ ఇవ్వడం కొసమెరుపు.

కాగా దీనిపై ఎంతోమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Viral Can An Auto Be Made Like This Engineers Are Also Jealous Of His Creativit

కొందరు సదరు ఆటోని రాయల్‌గా ఉందని అంటుంటే.మరికొంతమంది ఆ ఆటోని తమ పెళ్లిళ్ల ఊరేగింపునకు ఇవ్వాలని అడుగుతుండడం విశేషం.మరికొంతమంది ‘భారతీయులు అనేక విషయాల్లో అప్‌గ్రేడ్ అయ్యారంటూ’ ఇంకొందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

కాగా, గతంలోనూ ఇలాంటి ఆటో రిక్షా డిజైన్ ఒకటి నెట్టింట వైరల్ అయింది.అయితే దానికి ఇది దానికంటే కూడా అద్భుతంగా వుంది.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?
Advertisement

తాజా వార్తలు