వైరల్: ఇసుకతో అద్భుతాలు చేస్తోన్న కళాకారుడు... మైమరిపించే కళాకృతి!

మన భారతదేశం సకల కళలకు పుట్టినిల్లు వంటిది.అందులో ముఖ్యమైనది శిల్పకళ.

ఇది వివిధ రూపాలలో నేడు దర్శనం ఇస్తోంది.

అందులో శాండ్ ఆర్ట్ ఒకటి.

చాలామంది కళాకారులు సముద్రం ఒడ్డున ఇసుకతో చాలా అందమైన ఆకృతులను తయారు చేస్తూ ఉండడాన్ని మీరు ఏదోఒక సందర్భంలో చూసే వుంటారు.అందులో కొన్నిటిని చూసినపుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.

తాజాగా అలాంటి ఓ కళాకృతికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఆహుతులను అలరిస్తోంది.దాంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

ఇక్కడ హాకీ క్రీడ గురించి తెలియని క్రీడాకారులు వుండరు.భారతదేశంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆట ఇది.అయితే కాలక్రమేణా క్రికెట్ మహిమ వలన దాని ప్రాబల్యం కోల్పోయింది అని చెప్పుకోవచ్చు.అలాగే క్రీడాకారులు కూడా ఎవరూ ఆ ఆటపై పెద్దగా దృష్టి పెట్టక పోవడంతో హాకీ మరుగున పడిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు.

కాగా తాజాగా ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మెడల్ సాధించిన సంగతి తెలిసినదే.దీంతో దేశం మొత్తం ఆనందంలో మునిగిపోయింది.

ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి అయినటువంటి సుదర్శన్ పట్నాయక్ చాలా రోజుల తర్వాత తన కళాప్రతిభకు పదును పెట్టాడు.అవును, ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టిక్ ను ఇసుకతో తయారుచేసి ఔరా అనిపించాడు.105 అడుగుల పొడవున్న ఈ హాకీ స్టిక్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా పట్నాయక్ అభివర్ణించాడు.కటక్ లోని మహానది నదీ తీరంలో ఈ హాకీ స్టిక్ కొలువుదీరింది.

కాగా 2023 పురుషుల FIH హాకీ వరల్డ్ కప్ కు ఒడిశా ఆతిథ్యమిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు